ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.25
సూర్యాస్తమయం: సాయంత్రం.5.41
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.10.22 ల11.30
దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ.2.48 ల3.36
మేషం:
<img src="https://telugustop.com/wp-content/uploads/2024/11/Meesha-Rasi-phalalu-November-202″/>ఈరోజు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది.ఉద్యోగమున సమస్యలు పరిష్కరించుకుంటారు.
వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది.బంధువులలో స్వల్ప వివాదాలు ఉంటాయి.
వృషభం:

ఈరోజు ఆర్ధిక లాభం కలుగుతుంది.గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది.సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.
సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి.బంధు మిత్రుల సహాయం అందుతుంది.ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి.
మిథునం:

ఈరోజు చేపట్టిన పనుల యందు జాప్యం కలుగుతుంది.వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి.ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది.
ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కర్కాటకం:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
ధన సంబంధిత విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి.వ్యాపారాలలో భాగస్థుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం:

ఈరోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
విద్యార్దులు మరింత కష్టపడాలి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి.వృధా ఖర్చులు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
కన్య:

ఈరోజు నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.
నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు ఉంటాయి.
తుల:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కలసి వస్తాయి.అవసరానికి ఇతురుల సహాయం అందుతుంది.సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి.
గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.వృత్తి, ఉద్యోగపరంగా స్వంత నిర్ణయాలు అమలు పరచడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికం:

ఈరోజు చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి.స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో వివాదాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి.
ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు.ప్రయాణాలు వాయిదా పడతాయి.సంతాన విద్యా ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి.
ధనుస్సు:

ఈరోజు వివేచన జ్ఞానంతో ముందుకు సాగుతారు.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.
ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.వ్యాపారాలు లాభిస్తాయి.సంతానం నుండి శుభ వార్తలు అందుతాయి.
మకరం:

ఈరోజు ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది.
వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కుంభం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.సంతాన విద్యా వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది.
ప్రయాణాలలో నూతనపరిచయాలు కలుగుతాయి.ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.ఇతరుల మాటల వలన మానసిక అశాంతి కలుగుతుంది.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి.
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.