పెరూ దేశంలో( Peru ) ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.గూడ్స్ రైలు( Goods Train ) కింద పడి నుజ్జునుజ్జు కావాల్సిన వ్యక్తి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
రైలు పట్టాల పక్కనే నిద్రపోతున్న అతడిని ఢీకొడుతూ రైలు వెళ్లినా క్షేమంగా బయటపడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా( Viral Video ) మారింది.
విషయం ఏంటంటే, ఆ యువకుడు ఫుల్లుగా మద్యం మత్తులో( Drunk ) ఉన్నాడట.
మైకంలో జోగుతూ పట్టాలపైనే నిద్రపోయాడు.దీంతో రైలు వస్తున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా అలాగే పడుకుని ఉండిపోయాడు.
ఈ షాకింగ్ ఘటన పెరూ రాజధాని లిమా నగరంలో( Lima ) జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.
అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు ఈ ఊహించని ప్రమాదాన్ని రికార్డ్ చేశాయి.
వీడియోలో ఆ వ్యక్తి పట్టాల పక్కన కదలకుండా పడుకుని ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.ఆ తర్వాత నెమ్మదిగా కదులుతూ వస్తున్న గూడ్స్ రైలు అతడిని తాకుతూ ముందుకు వెళ్లిపోతుంది.
రైలు వెళ్లిపోయాక, ఆ వ్యక్తి వెంటనే లేచి నిలబడ్డాడు.ఏమీ జరగనట్లు ప్రశాంతంగా ఉండటం చూసి అందరూ అవాక్కయ్యారు.

స్థానిక అధికారి జనరల్ జేవియర్ అవలోస్ ఈ ఘటనపై స్పందించారు.ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, అందుకే రైలు వస్తున్న శబ్దం కూడా వినలేకపోయాడని చెప్పారు.ఫుల్లుగా తాగేసి పట్టాలపైనే స్పృహ కోల్పోయి పడుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

చూస్తుంటే ప్రాణాలు పోయేంత ప్రమాదంలా కనిపించినా ఆ వ్యక్తి మాత్రం అదృష్టవంతుడు. అతడికి కేవలం ఎడమ చేతికి మాత్రమే చిన్న గాయాలయ్యాయి.వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు.
అసలు ఇది నమ్మశక్యం కాని ఘటన.చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఆ వ్యక్తి కేవలం చిన్న గాయాలతో బయటపడటం నిజంగా అదృష్టం.అయితే అధికారులు మాత్రం అతడి పేరును వెల్లడించలేదు.కానీ, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రైలు పట్టాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.







