తమిళనాడులో సెంగమలం( Sengamalam Elephant ) అనే ఓ ఏనుగు ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది.దాని సైజు చూసి కాదు, దాని బలం చూసి కాదు, దాని స్టైలిష్ హెయిర్ కట్( Stylish Haircut ) చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు.సెంగమలం మన్నారుగుడిలోని రాజగోపాలస్వామి గుడిలో( Rajagopalaswamy Temple ) ఉంటోంది.2003లో కేరళ నుంచి తీసుకొచ్చారు ఈ ఏనుగుని.అప్పటినుంచి భక్తులు, టూరిస్టులు అందరికీ సెంగమలం ఫేవరెట్ అయిపోయింది.కానీ ఇప్పుడు మాత్రం తన హెయిర్ స్టైల్‌తో ఆన్‌లైన్ స్టార్ అయిపోయింది ఈ అమ్మడు.
ఇండియా కల్చరల్ హబ్ అనే ఇన్‌స్టా పేజీలో సెంగమలం వీడియో పెట్టారో లేదో అది ఇట్టే వైరల్ అయిపోయింది.ఆ వీడియోలో సెంగమలం స్పెషల్ హెయిర్ కట్ చూసి జనాలు షాక్ అవుతున్నారు.
అసలు ఈ హెయిర్ స్టైల్ వెనుక ఉన్నది ఎవరంటే.సెంగమలం మహావుత్ ఎస్.రాజగోపాల్. ఆయనే స్వయంగా ఎంతో ప్రేమగా తన జుట్టుని కత్తిరించి బొబ్ కట్ స్టైల్ లో( Bob Cut Style ) మెయింటైన్ చేస్తున్నారు.

ఈ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి రోజుకి మూడుసార్లు జుట్టుకి షాంపూ పెట్టి మరీ తలస్నానం చేయిస్తారు.అది కూడా సమ్మర్ లో కాగా మిగతా సీజన్స్ లో అయితే రోజుకి ఒక్కసారైనా స్నానం కంపల్సరీ.అంతేకాదు, ఈ ఎండాకాలంలో సెంగమలం చల్లగా ఉండటం కోసం ఏకంగా 45 వేలు పెట్టి స్పెషల్ షవర్ కూడా పెట్టించారు.

సెంగమలం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవుతున్నాయి.జనాలు ఆ హెయిర్ స్టైల్ కి ఫ్లాట్ అయిపోయారు.అచ్చం బొబ్ కట్‌లా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కొందరైతే మరీ కామెడీగా “మాకంటే ఈ ఏనుగుకే మంచి జుట్టు ఉంది బాబోయ్” అని జోకులు పేలుస్తున్నారు.ఇంకొందరైతే “ఈ ఏనుగు మహా ఖరీదైన రాణిలా ఉంది” అంటున్నారు.
ఒక టూరిస్ట్ “నేను ఈ గుడికి రెండుసార్లు వచ్చాను, సెంగమలం చాలా క్యూట్ గా ఉంది” అని కామెంట్ చేశారు.
సెంగమలం వైరల్ అవ్వడం ఇదేం మొదటిసారి కాదు.2020లో కూడా వీడియోలు వైరల్ అయ్యాయి.ఇక ఏనుగు తల మీద ఉండే జుట్టు శరీరం వేడిని బయటికి పంపడానికి సహాయపడుతుంది.
అంటే జుట్టు ఉండటం కూడా చాలా ముఖ్యం అని చెప్పొచ్చు.సెంగమలం కేవలం గుడి ఏనుగు మాత్రమే కాదు తన వింతైన హెయిర్ స్టైల్ తో ఇంటర్నెట్ స్టార్ కూడా అయిపోయింది.







