పనస పండు తినడం వల్ల మధుమేహం తగ్గుతుందా....

ఈ మధ్య కాలంలో చాలా మంది మధుమేహం తో బాధ పడుతున్నారు.ఇక మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఎన్నో మందులను ఇన్సులిన్ లను వాడుతున్నారు.

 Can Eating Jack Fruit Reduce Diabetes Details, Eating Jack Fruit, Reduce Diabete-TeluguStop.com

అయితే రోజు తీసుకునే ఆహారం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు.పనస పండు యొక్క పొట్టు మధుమేహాన్ని నియంత్రణలో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

అయితే పనసపొట్టును కూరగా గానీ, బిర్యానీగా గానీ ఏ రూపంలోనైనా ఆహారంలో తీసుకున్నా కూడా మీకు మధుమేహం అదుపులో ఉంటుంది.ఇక రోజూ పనస పొట్టును ఆహారంలో తీసుకుంటే బ్లడ్‌షుగర్‌ నియంత్రణలో ఉండటంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలు దూరమైనట్లు పరిశోధనల్లో తేలింది.

ఈ విషయాన్ని అహ్మదాబాద్‌ రామానంద్‌ క్లినిక్‌ ఎండ్రోకిన్‌ పిజీషియన్‌ డాక్టర్‌ వినోద్‌ అభిచందాని తెలిపారు.

జాక్‌ఫ్రూట్‌ 365 సంస్థ శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వినోద్‌ మాట్లాడుతూ,పనస పండు దక్షిణాది వంటకాల్లో విరివిగా వాడతారాని పండని పనసను ఎండబెట్టి పౌడర్‌ రూపంలో ఆహార పదార్థాల్లో కలిపి తింటే ప్రయోజనం ఉంటుందని ఆయన చెప్పారు.అలాగే జాక్‌ ఫ్రూట్‌ 365 వ్యవస్థాపకులు జేమ్స్‌ జోసెఫ్‌ పరిశోధన వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఉన్న ప్రభుత్వ వైజ్ఞానిక సంస్థలో టైప్‌ టూ డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారని 40 మందిని రెండు గ్రూప్‌లుగా విభజించి పరిశోధనలు నిర్వహించామని చెప్పారు.

Telugu Sugar Levels, Diabetes, Jack Fruit, Tips, Jackfruit, Palm Fruits, Reduce

ఒక గ్రూపు వారికి భోజనానికి ముందు పచ్చి పనస పొట్టునీ వరుసగా 12 వారాల పాటు అందించామని చెప్పారు.అయితే పచ్చి పసన పొట్టు తీసుకున్న వారితో పోల్చితే, టైప్‌ టూ డయాబెటిస్‌ మెలిటస్‌ రోగుల్లో గ్లైసిమిన్‌ నియంత్రణలో ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు.ఫెర్నాండజ్‌ ఆస్పత్రి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ లతా శశి మాట్లాడుతూ, మధుమేహ రోగుల్లో పచ్చి పనసపొట్టు ప్రయోగాన్ని తాను పరిశీలించానని చెప్పారు.

ఇక దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే మధుమేహ రోగులకు మేలు జరుగుతుందని ఆమె చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube