యూట్యూబర్ నుంచి రెజ్లర్‌గా మారిన లోగన్ పాల్( Logan Paul ) ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోనూ తన మ్యాజిక్ చూపించాడు.లండన్‌లోని వేంబ‍్లీ స్టేడియంలో( Wembley Stadium ) మార్చి 8న జరిగిన సిడ్‌మెన్ ఛారిటీ మ్యాచ్( Sidemen Charity Match ) 2025లో లోగన్ పాల్ చేసిన గోల్ సెలెబ్రేషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.
సిడ్‌మెన్ ఎఫ్‌సీ తరపున ఆడుతున్న లోగన్ పాల్ యూట్యూబ్ ఆల్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా WWE స్టైల్‌లో గోల్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు.
అసలు ఏం జరిగిందంటే, జో వెల్లర్ గోల్ కొట్టగానే లోగన్ పాల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు.
WWEలో ఫేమస్ అయిన వెర్టికల్ సప్లెక్స్ మూవ్‌తో( Vertical Suplex Movie ) జో వెల్లర్‌ను నేలకేసి కొట్టాడు.అంతేకాదు, అక్కడే ఉన్న టీమ్‌మేట్స్ రెఫరీలుగా మారి ఏకంగా త్రీ-కౌంట్ పిన్ కూడా చేశారు.
ఇది చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రెజ్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను చూసి పండగ చేసుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌కు వచ్చిన ప్రేక్షకులతో వేంబ‍్లీ స్టేడియం నిండిపోయింది.ఏకంగా 90 వేల మంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చారు.ఐ షో స్పీడ్, యాంగ్రీ గింజ్, మిస్టర్ బీస్ట్, కై సెనాట్, లోగన్ పాల్ లాంటి టాప్ సెలబ్రిటీలు ఈ మ్యాచ్‌లో ఆడారు.
వీళ్లంతా వస్తున్నారని తెలియడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.కేవలం మూడు గంటల్లోనే టికెట్లన్నీ అయిపోయాయంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ 9-9తో డ్రా అయింది.పెనాల్టీ షూటౌట్‌లో యూట్యూబ్ ఆల్ స్టార్స్ 5-4తో సిడ్‌మెన్ ఎఫ్‌సీపై గెలిచింది.ఐ షో స్పీడ్ లాస్ట్ పెనాల్టీ కొట్టి యూట్యూబ్ ఆల్ స్టార్స్‌కు అదిరిపోయే విక్టరీ అందించాడు.
ఇదిలా ఉండగా, లోగన్ పాల్ WWEలోనూ తన హవా కొనసాగిస్తున్నాడు.
వచ్చే వారం మండే నైట్ రా ఎపిసోడ్‌లో లోగన్ పాల్ కనిపించబోతున్నాడు.అక్కడ ఏజే స్టైల్స్ అతడితో ఫైట్ పెట్టుకునేందుకు రెడీగా ఉన్నాడట.
రాయల్ రంబుల్‌లో ఏజే స్టైల్స్‌ను లోగన్ పాల్ ఎలిమినేట్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య గొడవ మొదలైంది.నిజానికి ఏజే స్టైల్స్ నాలుగు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది ఈ మ్యాచ్‌తోనే.
ఫుట్‌బాల్, రెజ్లింగ్, వైరల్ వినోదం అన్నీ కలిపి లోగన్ పాల్ ఒక సంచలనం.నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి.







