స్పాట్ లెస్ స్కిన్ ను( Spotless Skin ) అందరూ కోరుకుంటారు.కానీ అటువంటి చర్మాన్ని పొందడం అంతా సులభం కాదని భావిస్తుంటారు.
ఎందుకంటే ఎంత కేర్ తీసుకున్నప్పటికీ ముఖంపై ఏదో ఒక కారణం వల్ల నల్లటి మచ్చలు( Dark Spots ) ఏర్పడుతూనే ఉంటాయి.పైగా అవి ఓ పట్టాన అస్సలు పోవు.
ఆ మచ్చలను వదిలించుకునేందుకు ఎంతో ఖరీదైన క్రీములను వాడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలు పోగొట్టుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ ను అస్సలు మిస్ అవ్వకండి.

చందనం పొడి( Sandalwood Powder ) చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల చందనం పొడి ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేయడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ చందనం పొడి మరియు ఐదు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని బాగా మిక్స్ చేసి గంటపాటు పక్కన పెట్టుకోవాలి.
గంట అనంతరం చందనం పొడి నానబెట్టుకున్న రోజ్ వాటర్ ను జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన చందనం క్రీమ్ అనేది రెడీ అవుతుంది.ఒక బాక్స్ లో ఈ క్రీమ్ ను నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న చందనం క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.
నిత్యం ఈ క్రీమ్ ను కనుక వాడితే కొద్ది రోజుల్లోనే చర్మం పై మచ్చలన్ని మాయం అవుతాయి.మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.
అలాగే ఈ క్రీమ్ స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.ముడతలు మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వడదెబ్బను తగ్గించడానికి, సన్‌టాన్‌ను తొలగించడానికి మరియు ఎండ వల్ల ఎర్రగా మారిన చర్మాన్ని రిపేర్ చేయడానికి కూడా ఈ క్రీమ్ ఉత్తమంగా హెల్ప్ చేస్తుంది.







