మెగా డాటర్ నిహారిక ( Niharika )ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈమె తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఒకవైపు నిర్మాతగా మారి సినిమాలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూనే మరోవైపు నటిగా కూడా కొనసాగుతున్నారు.ఇక ఇటీవల ఈమె తెలుగులో కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
ఇక ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో నిహారిక ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగ నిహారిక తరచూ ఏదో ఒక విధంగా వార్తలలో నిలుస్తూనే ఉంటారు తన భర్తకు విడాకులు ఇవ్వడంతో ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుందని అయితే తన బావ సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) ను పెళ్లి చేసుకుంటుంది అంటూ వార్తలు వచ్చాయి.ఈ వార్తల పై నిహారిక కాస్త ఘాటుగానే స్పందించారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు యాంకర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.ఇలా కుటుంబంలో అత్యంత క్రేజీ ఎవరు అనే ప్రశ్న నిహారికకు ఎదురయింది.ఈ ప్రశ్నకు నిహారిక అల్లు అర్జున్( Allu Arjun ) పేరు చెప్పటం విశేషం.ఆయన హైపర్ యాక్టివ్ అని, ఎనర్జీ వేరే లెవల్ అని తెలిపింది.
ఇక ఎవరినీ బుట్టలో పడేయటం ఈజీ అంటూ యాంకర్ అడగడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) అంటూ సమాధానం చెప్పారు.ఏం చెప్పినా నమ్మేస్తాడని, నాకు వాడు టెడ్డీ బేర్ లాంటోడని చెప్పి నవ్వులు పూయించారు.
ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.