అమెరికాలో( America ) అక్రమంగా నివసిస్తున్న వారిని డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.మిలటరీ విమానాల్లో వారి తరలింపు ప్రక్రియ చేపట్టగా.
వలసదారుల చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి అత్యంత అమానవీయంగా వారిని దేశం నుంచి బహిష్కరించడం కలకలం రేపుతోంది.దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.
యూఎస్ అధికారులపై అన్ని వైపులా విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిణామాలపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ( US Department of Homeland Security )(డీహెచ్ఎస్) మండిపడింది.
ఇమ్మిగ్రేషన్ దాడుల సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్న వారిని గుర్తించడానికి తన సిబ్బందికి డీహెచ్ఎస్ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.డీహెచ్ఎస్ ప్రతినిధి ప్రకారం … పాలిగ్రాఫ్ పరీక్షలు దాదాపు మూడు నెలలుగా జరుగుతున్నాయి.
అయితే ఎంతమంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించబడ్డాయన్నది తెలియరాలేదు.

హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్( Homeland Security Secretary Kristi Noem ) మాట్లాడుతూ.డీహెచ్ఎస్‌లోని నేరస్థులను తాము గుర్తించామని, వీరిని విచారించడానికి సిద్ధమవుతున్నామన్నారు.నేరం రుజవైతే వీరంతా 10 ఏళ్ల వరకు ఫెడరల్ శిక్షలను అనుభవిస్తారని తెలిపారు.
మీడియాకు సమాచారం అందించిన అందరినీ తాము గుర్తించి, అమెరికన్లకు న్యాయం చేస్తామని నోయెమ్ పేర్కొన్నారు.ఈ లీక్‌లను అరికట్టడానికి డీహెచ్ఎస్ తన ఉద్యోగులకు పాలిగ్రాఫింగ్ ప్రారంభిస్తుందని ఫిబ్రవరి 18న నోయెమ్ ప్రకటించారు.

కాగా.వైట్‌హౌస్ గణాంకాల ప్రకారం హంతకులు, రేపిస్టులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు సహా గుర్తింపులేని 50 వేల మందికి పైగా పత్రాలు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలని అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.డీహెచ్ఎస్ ఆధ్వర్యంలోని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది.దీని కారణంగా వేలాది మందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.పలువురిని దేశం నుంచి బహిష్కరించింది.ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.







