గూగుల్ ఆఫీసులు (Google Office )అంటేనే లగ్జరీ రిసార్ట్‌ల వలె ఉంటాయి.ప్రపంచమంతా వాటి డిజైన్, క్రియేటివిటీతో(design ,creativity) మతులు పోగొడుతుంటాయి.
ఉద్యోగులు హ్యాపీగా, కూల్‌గా పనిచేయడానికి కావాల్సినవన్నీ అక్కడ రెడీగా ఉంటాయి.తాజాగా గూగుల్ గుర్గావ్ ఆఫీస్ వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
చూసినోళ్లంతా వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు.
శివాంగి గుప్తా (Shivangi Gupta)అనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్, షాంతను & నిఖిల్ బ్రాండ్స్‌కి డిజైనర్ కూడా ఫిదా అయిపోయింది.
తను గూగుల్ ఆఫీస్‌కి(Google Office) వెళ్లిందో లేదో వీడియో తీసి సోషల్ మీడియాలో(social media) పెట్టేసింది.ఇంకేముంది, రెండు రోజుల్లోనే 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి.“మరో అలసట లేని రోజు గూగుల్‌లో!” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది శివాంగి.వీడియోలో ఆఫీస్ లోపలంతా చూపిస్తూ గూగుల్ కల్చర్ ఏంటో చూపించింది.
ఇది ఆఫీసా(office) లేక ఆట స్థలామా (Playground)అనిపిస్తుంది.ఉద్యోగులు అస్సలు బోర్ కొట్టకుండా, హ్యాపీగా పనిచేసేలా డిజైన్ చేశారు.శివాంగి వీడియోలో చూపిస్తూ ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసింది.ఫస్ట్ మైక్రో కిచెన్ చూపించగా అందులో స్నాక్స్, డ్రింక్స్ అన్నీ ఫుల్లుగా ఉన్నాయి.
ఇక గేమ్స్ రూమ్‌లో పూల్ టేబుల్ కనిపించింది.బ్రేక్ టైమ్‌లో ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అని వీడియో చూసిన నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇంకో షాకింగ్ ఏంటంటే, కాసేపు పడుకోవడానికి రూమ్ కూడా పెట్టారు.ఉద్యోగులు రిలాక్స్ (Employees relax)అవ్వడానికి స్పెషల్ రూమ్స్ ఉన్నాయి.మసాజ్ చేయించుకోవడానికి మసాజ్ చైర్స్ కూడా ఉన్నాయి.టూర్‌లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూపించింది శివాంగి.టెక్ వెండింగ్ మెషీన్ ఒకటి ఉంది అక్కడ.టెక్ గ్యాడ్జెట్స్ కావాలంటే ఈజీగా తీసుకోవచ్చంట.
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్‌తో (musical instruments)ఎంటర్‌టైన్‌మెంట్ రూమ్ కూడా ఉంది.పాటలు పాడుకోవచ్చు, మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు ఫుల్ చిల్ అవ్వొచ్చు.
ఆఫీస్ మొత్తం కంఫర్టబుల్ సోఫాలతో నింపేశారు.ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు.
వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.ఆఫీస్ డిజైన్, ఫెసిలిటీస్ చూసి నోరెళ్లబెడుతున్నారు.“ఇది కదా డ్రీమ్ వర్క్‌ప్లేస్(Dream Workplace) అంటే” అని ఒకరు కామెంట్ చేస్తే, “గూగుల్ ఉద్యోగులని ఎంత బాగా చూసుకుంటుందో చూడండి” అని ఇంకొకరు అన్నారు.

పని, రిలాక్సేషన్ రెండిటికీ గూగుల్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అని చాలామంది మెచ్చుకుంటున్నారు.“నాప్ రూమ్ అనేది సూపర్ ఐడియా, మెంటల్ హెల్త్‌కి చాలా మంచిది” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.టెక్ వెండింగ్ మెషీన్ గురించి అయితే “జీనియస్ ఐడియా” అంటున్నారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







