మరి కొన్ని రోజులలో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది.ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతంగా ఉండాలని అందరి జీవితంలోనూ మంచి జరగాలని కోరుకుంటారు.
అలాగే వారి కోరికలు కూడా కొత్త ఏడాదిలో తీరిపోవాలంటే చాలామంది ఎన్నో కోరికలు కోరుకుంటారు.కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత చాలామంది ఈ ఏడాది మొత్తం వారికి శుభం కలగాలని పెద్దఎత్తున ఆలయాలను సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మరి ఈ కొత్త సంవత్సరం మనకు శుభం కలగాలంటే ఈ చిన్న పనులను చేయాలని పండితులు చెబుతున్నారు.
కొత్త సంవత్సరం మొదట వినాయకుడికి పూజ చేసి అనంతరం ఇష్టదైవానికి పూజ చేయాల్సి ఉంటుంది.
ఏడాది పొడుగునా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.లక్ష్మీదేవి చిన్న ఫోటోను నిత్యం మన పరిధిలో పెట్టుకోవటం వల్ల అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.
అదేవిధంగా రావి ఆకులపై స్వస్తిక్ గుర్తు వేసి దానిని కూడా పర్సులో పెట్టుకోవాలి.కొత్త సంవత్సరంలో మనం ఏదైనా కోరిక కోరుకుని నెరవేరాలంటే ఎర్రటి కాగితంపై మన కోరికను రాసి ఆ కాగితాన్ని ఏదైనా ఆలయంలో చెట్టుకు కట్టాలి.
అలాగే ప్రతిరోజు మన కోరిక నెరవేరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కోరిక నెరవేర్చడం కోసం ప్రయత్నాలు చేయాలి.మన ఇంట్లో ఉత్తరం దిశ వైపు మట్టి కుండలో నీటిని నింపడం వల్ల ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.ఈ విధమైనటువంటి కొన్ని నియమాలను పాటించడం వల్ల కొత్త ఏడాది మొత్తం ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL