ఈ సంవత్సరం దీపావళికి కొత్తవారు కూడా నోములు నోచుకోవచ్చా..!

దీపావళి పండుగ అంటే కేవలం టపాసుల పండగ మాత్రమే కాదు అని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు నోముల పండుగ కూడా అని చెబుతున్నారు.

 It Is A Tradition To Pray To Goddess Lakshmi Especially On Diwali Details, Godd-TeluguStop.com

ఈ దీపావళికి ప్రత్యేకంగా నోములు నోచుకుని లక్ష్మీదేవిని( Lakshmi Devi ) పూజించడం సంప్రదాయంగా వస్తూ ఉంది.ఈ సంవత్సరం ఆదివారం రావడంతో మహిళలు ఈ నోములు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

అంతే కాకుండా ఆదివారమే నోములు నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు.అలాగే అమావాస్య సోమవారం మధ్యాహ్నం వరకు ఉండడంతో ఆదివారం నోములు చేసుకోవడం మంచిది అని చెబుతున్నారు.

Telugu Diwali, Diwali Festival, Diwali Nomulu, Goddess Lakshmi, Lakshmi Devi-Lat

ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం దీపావళి స్వాతి నక్షత్రంలో( Swathi Nakshatram ) వచ్చింది.కాబట్టి కొత్త వారు కూడా నోములు నోచుకోవచ్చని పండితులు చెబుతున్నారు.అలాగే కొత్త వారు ఈ సంవత్సరం నోములు నోచుకోవాడం మంచిదని సూచిస్తున్నారు.ఈ సంప్రదాయం ప్రకారం ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలోని మహిళలు నోములు నోచుకుంటారు.తెలంగాణ రాష్ట్రంలోని( Telangana ) చాలా మంది ప్రజలు బంధువులను పిలిచి లక్ష్మీదేవికి పూజలు చేసి నోములు నోచుకుని బంధుమిత్రులకు భోజనాలు పెడతారు.అంతే కాకుండా అందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో దీపావళి( Diwali ) సందర్భంగా కేదారీశ్వరి వ్రతం కూడా చేసుకుంటారు.

Telugu Diwali, Diwali Festival, Diwali Nomulu, Goddess Lakshmi, Lakshmi Devi-Lat

ఈ వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటుండదని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అందుకే కేదారీశ్వరి వ్రతం( Kedareshwari Vrat ) చేసుకోవడం ఆనవాయితీగా వస్తు ఉంది.ప్రధానంగా మహిళలు లక్ష్మీ పూజలు చేస్తుంటారు.

దీపావళి రోజు సాయంత్రం వ్యాపారులు లక్ష్మీ పూజలు నిర్వహించి కొత్త ఖాతా పుస్తకాలను మొదలుపెడతారు.ఇది మార్వాడి లు ఎక్కువగా చేస్తూ ఉంటారు.

ఆ రోజు నుంచే వారికి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుందని నమ్ముతారు.అలా అందరూ ఆనందంగా నోములు చేసుకుని సాయంత్రానికి టపాసులు పేల్చుకుని, దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube