మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం నాయకన్.ఇదే సినిమా తెలుగులో నాయకుడు పేరుతో విడుదల అయ్యింది.ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.విమర్శకుల ప్రశంసలు పొందింది.సినిమా పరిశ్రమలో కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది.అంతేకాదు.
ఈ సినిమా ఆస్కార్ అవార్డుల పోటీకి భార్ నుంచి ఎంట్రీ అయ్యింది.సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ సినిమా అమెరికా డిస్టిబ్యూషన్ రైట్స్ ను భారతీయుడు శంకర్ రమణి దక్కించుకున్నాడు.
అక్కడ పలు నగరాల్లో ఈ సినిమాను ప్రదర్శించాలి అనుకున్నాడు.అంతేకాదు.
ఈ ప్రదర్శనల్లో పాల్గొనాలని కమల్ హాసన్ తో పాటు, ఈ సినిమా నిర్మాత వెంకటేశ్వరన్ ను పిలిచాడు.
మొత్తం 10 రోజుల పాటు అమెరికా పర్యటన ఖరారు అయ్యింది.
నిర్మాత వెంకటేశ్వరన్‌తో కలిసి అమెరికాకు వెల్లాడు కమల్.న్యూయార్క్ జాన్ కెన్నడీ ఎయిర్‌పోర్టులో దిగారు.
శంకర్ రమణి వారికి ఘన స్వాగతం చెప్పాడు.అక్కడి నుంచి డెట్రాయిట్ వెళ్లారు.
తమిళ సంఘాలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.అనంతరం డల్లాస్ లో జరిగే సినిమా ప్రదర్శనకు వెళ్లాలి.

దీంతో కమల్ తో పాటు వెంకటేశ్వరన్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు.వారు వెళ్లాల్సిన విమానం రెండు సార్లు సాంకేతిక సమస్యలకు గురైంది.అనంతరం టేకాఫ్ అయ్యింది.కొద్ది సేపటికే విమానం భారీ కుదుపులకు గురయ్యింది.ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కానీ ప్రమాదం ఏమీ లేదని సిబ్బంది చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మొత్తంగా మెంఫిస్ ఎయిర్‌పోర్టులో సేఫ్ గా దిగారు.
అక్కడి నుంచి మరో విమానంల డల్లాస్ కు వెళ్లారు.

తీరా అక్కడికి వెళ్లాక వారి సామాన్లలో ఓ పెట్టె కనిపించలేదు.దీంతో కమల్ టీం కంగారుకు గురైంది.ఆ పెట్టెలో నాయకన్ ప్రింట్ ఉంది.మరుసటి రోజు ఉదయమే డల్లాస్ లో ఆ సినిమాను ప్రదర్శించాలి.ఏం చేయాలో అర్థం కాలేదు.ఇంతలో ఎయిర్ పోర్టు నుంచి కాల్ వచ్చింది.
అక్కడే పెట్టె ఉందని వచ్చి తీసుకెళ్లాలని పిలుపు వచ్చింది.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.