పిక్‌ టాక్ : సీతూ పాప స్మైల్‌ తో సూపర్ ఫ్యాన్స్ ఫిదా

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అభిమానులు ఆయన పాప సితార కు కూడా వీరాభిమానులు అయ్యి ఉంటారు.ఎందుకంటే సీతూ పాపను చూస్తే మహేష్‌ బాబు అభిమానులకు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులకు ఒక మాట చెప్పాలంటే మహేష్‌ బాబు యాంటీ ఫ్యాన్స్ కు కూడా ముద్దు చేయాలనిపిస్తుంది.

 Photo Talk Mahesh Babu Daughter Sitara Looks Like Cute,latest Socil  Media-TeluguStop.com

అంత క్యూట్‌ గా ముద్దుగా ఉండే సితార రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ సోషల్ మీడియా క్వీన్‌ అంటూ పేరు దక్కించుకుంది.చిన్న వయసు లోనే స్నేహితురాలితో కలిసి ఏకంగా యూట్యబ్‌ ను రన్‌ చేస్తున్న సీతూ పాప ఆకట్టుకునే అందంతో పాటు అభినయం తో కూడా మెప్పిస్తుంది.

క్యూట్‌ లుక్స్‌ తో చూడగానే చిరు నవ్వు వచ్చేలా చేసే సీతూ పాప కొత్త ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

పింక్ కలర్‌ టీ షర్ట్‌.సింపుల్‌ జగ్గిన్‌ వేసుకుని హెయిర్‌ లీవ్‌ చేసి సింప్లిసిటీకి మారు పేరు అన్నట్లుగా ఉన్న సీతూ పాప ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఆ చిరు నవ్వు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

మహేష్‌ బాబు అభిమానులు సీతూ పాప నవ్వుతో ఫిదా అవుతున్నారు.మహేష్‌ బాబు నట వారసురాలిగా సీతార హీరోయిన్ గా నటించాలని ఇప్పటి నుండే కొందరు కోరుకుంటున్నారు.

అన్న గౌతమ్‌ కంటే కూడా ఎక్కువ పాపులారిటీని మరియు ప్రచారంను దక్కించుకున్న సీతూ పాప ముందు ముందు మరెంతగా సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.సీతూ పాప త్వరలో ఒక సినిమా లో నటించబోతుందనే వార్తలు వచ్చాయి.

ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.మహేష్‌ బాబు త్వరలో జక్కన్న సినిమా లో చేయబోతున్నాడు.

ఆ సినిమా లో ఏదైనా చిన్న రోల్‌ ను మహేష్‌ బాబు సీతూ పాపతో వేయిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.మరి అది జరిగేనా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube