విహారయాత్ర నిమిత్తం స్నేహితులతో కలిసి కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లికన్‌కు( Dominican Republic ) వెళ్లిన భారత సంతతికి చెందిన విద్యార్ధిని అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది.బాధితురాలిని 20 ఏళ్ల సుదీక్ష కోణంకిగా( Sudiksha Konanki ) గుర్తించారు.
అమెరికాలోని వర్జీనియాలో( Virginia ) నివసిస్తున్న సుదీక్ష గత వారం తన ఐదుగురు మిత్రులతో కలిసి కరేబియన్ దీవులకు విహారయాత్ర నిమిత్తం వెళ్లారు.ఈ క్రమంలోనే మార్చి 6వ తేదీన ప్యూంటా కానా ప్రాంతానికి వెళ్లారు.
అనంతరం రియూ రిపబ్లికా రిసార్ట్( Riu Republica Resort ) వద్ద బీచ్‌లో చివరిసారిగా కనిపించిన సుదీక్ష తర్వాత అదృశ్యమయ్యారు.ఆమె కోసం స్నేహితులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, డ్రోన్లు, హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు.గడిచిన నాలుగు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నా నేటి వరకు సుదీక్ష ఆచూకీ లభించలేదు.దీంతో ఆమె సముద్రంలో గల్లంతై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న సుదీక్ష కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మేరీల్యాండ్‌కు చెందిన ఓ వ్యక్తి .సుదీక్ష గురించిన వివరాలను పోస్ట్ చేయడం దర్యాప్తు అధికారులకు ఎంతో సాయం చేసినట్లయ్యింది.5 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో.చివరిగా బ్రౌన్ కలర్ బికినీ, గుండ్రని పెద్ద చెవిపోగులు, చేతికి పసుపు స్టీల్ బ్రాస్లెట్లు, ఎడమ చేతికి మల్టీకలర్ పూసల బ్రాస్లెట్ ధరించి కనిపించినట్లు మేరీలాండ్ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

సుదీక్ష కుటుంబ సభ్యులు భారత్‌కు చెందినవారే.ఆమె తల్లిదండ్రులు 2006లో అమెరికాకు( America ) వలస వెళ్లారు.సుదీక్ష కోణంకి.
పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో( Pittsburgh University ) కెమిస్ట్రీ అండ్ బయాలాజికల్ సైన్సెస్ చదువుకుంటోందని ఆమె తండ్రి కోణంకి సుబ్బారాయుడు తెలిపారు.ప్రస్తుతం సెలవులు కావడంతో మిత్రులతో కలిసి పుంటా కానాకు వెళ్లిందని ఆయన చెప్పారు.
డాక్టర్ కావాలన్నది తన కుమార్తె కల అని సుబ్బారాయుడు కన్నీటి పర్యంతమయ్యారు.అంతకుముందు 2022లో థామస్ జెఫెర్సన్ హైస్కూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి బయోలాజికల్ సైన్సెస్‌లో డిప్లొమా పట్టా పొందారు.







