సోషల్ మీడియాలో తరచుగా పెంపుడు జంతువుల చిలిపి చేష్టలతో నిండిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.ఈ వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తాయి.
పిల్లులు, కుక్కలు, ఇతర జంతువులు చేసే వినోదభరిత చర్యలు మనసును ఉల్లాసపరుస్తాయి.ప్రస్తుతం చైనాలో( China ) జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇది ఏ జంతువో కాదు.ఒక పిల్లి( Cat ) బాబా అవతారం ఎత్తి భక్తులను ఆశీర్వదిస్తున్న దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది
చైనాలోని జియువాన్ దేవాలయంలో( Jiyuan Temple ) ఒక పిల్లి బాబా రూపంలో భక్తులను ఆశీర్వదించడం విశేషం.
సాధారణంగా పండితులు మెడలో రుద్రాక్ష మాలలు ధరించే మాదిరి, ఈ పిల్లి మెడలో మాత్రం బంగారు గొలుసు మెరవడం ఆశ్చర్యానికి గురిచేసింది.ఆలయానికి వచ్చే భక్తులను ఆకర్షిస్తూ, దాని ప్రత్యేక శైలిలో ఆశీర్వాదాలు( Blessing ) అందిస్తోంది.

గోడపై కూర్చున్న పిల్లి దగ్గరకు జనాలు వచ్చే సరికి, తన పంజాతో భక్తులను తాకుతూ ఆశీర్వదించడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.అంతేకాదు, ఫోటోలు దిగేటప్పుడు హై ఫైవ్ (ఫోజులు) కూడా ఇవ్వడం విశేషం.దీనిని చూసిన సందర్శకులు, భక్తులు ఆశీర్వాదాలు పొందేందుకు బారులు తీరారు.సుజౌలోని వెస్ట్ గార్డెన్ ఆలయంలో బంగారు గొలుసు ధరించిన పిల్లి పర్యాటకులతో హై-ఫైవ్‌లు ఇస్తూ, వారితో ఫోటోలు దిగుతున్న వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.

వీడియో చూసిన నెటిజన్లు పిల్లి బాబా చర్యలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం.మీరు ఈ ఇదేవును చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.ఇటువంటి అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొత్తేం కాదు.కానీ, ఒక పిల్లి భక్తులను ఆశీర్వదించడం, హై ఫైవ్‌లు ఇవ్వడం నిజంగా చూసేందుకు ప్రత్యేకంగా ఉంటుంది.మీరు కూడా ఈ వీడియోను చూసి “పిల్లి బాబా” ఆశీర్వాదాలు పొందండి.







