ఆస్తమా.ఇదో శ్వాసకోశ వ్యాధి.
ఒకసారి ఆస్తమా వస్తే ఎప్పుడూ అది మన వెంటే ఉంటుంది.ఈ శీతాకాలంలో ఆస్తమా మరింత తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.
వాతావరణం కాస్త చల్లగా మారిందంటే చాలు.ఆస్తమా వ్యాధి ఉన్న వారు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు.
ఆస్తమా రావడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ.అందరిలోనూ ఈ వ్యాధి లక్షణాలు మాత్రం కాస్త కామన్‌గానే ఉంటాయి.
దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఆస్తమా ప్రధాన లక్షణాలు.
ఇక ఈ వ్యాధిని పూర్తిగా నివారించడానికి చికిత్స లేదు.
కేవలం లక్షణాలను అదుపు చేసే మందులు, ఇన్హేలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.అయితే ఆస్తమా నుంచి ఉపశమనాన్ని అందించడంలో యాలకులు అద్భుతంగా సహాయపడతాయి.
సాధారణంగా యాలకులను అందరి ఇళ్లల్లోనూ విరి విరిగా ఉపయోగిస్తుంటారు.మసాలాద్రవ్యాల రారాణి యాలకుల్లో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.
యాలకుల ధర కాస్త ఎక్కువైనప్పటికీ.యాలక బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా ఆస్తమాను అదుపు చేయడంలో యాలకులు గ్రేట్‌గా ఉపయోగపడుతాయి.ఆకుపచ్చని యాలకులను పొడి చేసి.ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఒక గ్లాస్ వేడి పాలలో అర స్పూన్ యాలకుల పొడి, బెల్లం కలిపి తీసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఛాతీ నొప్పి, పిల్లికూతలు, శ్వాస తీసుకోలేకపోవడం, దగ్గు, ఆయాసం వంటి ఆస్తమా లక్షణాలకు దూరంగా ఉండొచ్చు.
ప్రతి రోజు వేడి వేడి అన్నంలో కొద్దిగా యాలకుల పొడి కలిపి రెండు ముద్దలు తిన్నా.
ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.కాబట్టి, ఆస్తమా ఉన్న వారు యాలకులను ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.
అలాగే యాలకులు రక్త ప్రసరణను తేలిక చేసి.ఉపిరితిత్తులకు మేలు చేస్తాయి.
ఇక కఫం, జలుబు వంటి సమస్యలతో బాధ పడేవారు రెగ్యులర్‌గా ఒక కప్పుడు యాలకుల టీ సేవిస్తే.త్వరగా ఉపశమనం లభిస్తుంది.