చూస్తుండగానే వర్షాకాలం రానేవచ్చింది.హైదరాబాద్ వాసులనైతే రోజుకోసారైనా పలకరిస్తోంది వర్షం.
ఇలాంటి సమయంలో చర్మం పగిలిపోవడం, మంట పెట్టడం, దురదపెట్టడం, ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి.చల్లని వాతావరణం నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రకరకాల క్రిములు వాడేస్తుంటారు.
డబ్బులు పెట్టడమే కాని, పూర్తిస్థాయిలో సంతృప్తి దొరకడం మాత్రం కష్టం.మరి వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకునేది ఎలా?
ముందుగా చేయాల్సిన పని సబ్బువాడకాన్ని తగ్గించడం.సబ్బుకి బదులుగా శనగపిండితో శరీరాన్ని రుద్దితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.ఒక్కసారిగా సబ్బు వాడకాన్ని పూర్తిగా వాడేయటం కష్టం అనిపిస్తే, రెండు,మూడు రోజులకోసారి సబ్బుతో స్నానం చేయండి.
ఇక పొడిచర్మం ఉన్నవారికైతే, వర్షాకాలం నరకంగా అనిపిస్తుంది.ఇలాంటివారు ఈ సీజన్ లో దొరికే రకరకాల పండ్లను తింటూ ఉండాలి.
గుడ్డు సొనను చర్మంపై ఉపయోగించినా ఫలితం ఉంటుంది.అలాగే బొప్పాయి, ఆపిల్ పండ్ల గుజ్జుని ముఖానికి పట్టి, ఇరవై నిమిషాలు ఉంచి, ఆ తరువాత ముఖం కడుక్కోవాలి.
గంధం, రోజ్ వాటర్, పసుపుని వీలు చిక్కినప్పుడల్లా ముఖానికి పడుతూ ఉండాలి.పెరుగు, పసుపు, తేనేలతో చేసిన మిశ్రమం కూడా పొడిచర్మం వారికి గొప్ప ఊరటను కలిగిస్తుంది.
చర్మం పగిలితే మాత్రం సబ్బు వాడకపోవడమే మంచిది.సున్నిపిండి, శనగపిండి ఇలాంటి సమయాల్లో పనికొస్తాయి.