నాగార్జున సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా.?

అన్ని రంగాల మాదిరిగానే సినిమా రంగంలో కూడా పోటీ అనేది ఉంటుంది.ఎవరికి వారు నెంబర్ వన్ కావాలనే కుతూహలం ఉంటుంది.

 Bollywood Celebrities Introduced Into Tollywood By Nagarjuna, Nagarjuna, Bollywo-TeluguStop.com

అందుకే మిగతా హీరోలతో పోల్చితే తమ సినిమాల్లో వెరైటీ ఉండాలని కోరుకుంటారు కొందరు హీరోలు.అందుకే పలువురు టాప్ సెలబ్రిటీలను తమ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయాలని కోరుతారు.

అలాంటి పాత్రల ద్వారా సినిమాలకు మంచి హైప్ తీసుకొచ్చి విజయం సాధించేందుకు ప్లాన్ వేస్తారు.సేమ్ ఇదే ఫార్ములాతో ముందుకు సాగాడు అక్కినేని నాగార్జున.

పలువురు బాలీవుడ్ స్టార్స్ ను తన సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసేలా ఒప్పించే వాడు.అలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు నాగార్జున తీసుకొచ్చిన టాప్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో నాగార్జునకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.ఈ కారణంగానే నాగ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తుంటాడు బిగ్ బి.నాగార్జున ఫ్యామిలీ మూవీ మనం సినిమాలో అథితి పాత్ర చేశాడు అమితాబ్.సమంతను ఆస్పత్రిలో జాయిన్ చేసే సీన్ లో సీనియర్ డాక్టర్ క్యారెక్ట్ పోషించాడు.కొన్ని నిమిషాల పాటు కనిపించే ఈ పాత్రలో నాగార్జునతో బిగ్ బి ఫోన్ లో మాట్లాడ్డం కనిపిస్తుంది.

సంజయ్ దత్

Telugu Aishwarya Rai, Big Nagarjuna, Bollywood, Nagarjuna, Ravoi Chandamam, Sanj

బాలీవుడ్ మరో టాప్ హీరో సంజయ్ దత్ కూడా నాగ్ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు.చంద్రలేఖ సినిమాలో సంజయ్ దత్ అతిథి పాత్ర పోషించాడు.యాక్సిడెంట్ అయిన హీరోయిన్ ని కాపాడేందుకు నాగార్జున వారి ఫ్యామిలీకి అబద్దం చెప్తాడు.

డబ్బు కోసం ఆ అబద్దాన్ని కొనసాగించలేక.తను చేసిన తప్పును సంజయ్ కి చెప్తాడు.

కానీ సంజయ్.నాగ్ బాధను అర్థం చేసుకోలేడు.

ఎందుకంటే ఆయనకు తెలుగు రాదు.ఈ సన్నివేశం జనాలను కడుపుబ్బా నవ్విస్తుంది.

ఐశ్వర్యరాయ్

Telugu Aishwarya Rai, Big Nagarjuna, Bollywood, Nagarjuna, Ravoi Chandamam, Sanj

బాలలీవుడ్ టాప్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ ని తెలుగులో నటించేలా చేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు.కానీ సక్సెస్ కాలేదు.నాగార్జున మాత్రం తన సినిమాలో ఐశ్వర్యతో స్పెషల్ సాంగ్ చేయించాడు.రావోయి చందమామ మూవీలో షకలక బేబీ అనే పాట చేసింది ఈ ప్రపంచ సుందరి.ఐశ్వర్య తెలుగులో చేసిన తొలి, చివరి సినిమా ఇదే కావడం విశేషం.

సుస్మితా సేన్

Telugu Aishwarya Rai, Big Nagarjuna, Bollywood, Nagarjuna, Ravoi Chandamam, Sanj

బాలీవుడ్ మరో టాప్ హీరోయిన్ సుస్మితా సేన్ కూడా తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది.ఆమె కూడా నాగార్జున సినిమాలోనే నటించింది.రక్షకుడు సినిమాలో నాగ్ తో రొమాన్స్ చేసింది హాట్ బ్యూటీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube