కలబందతో జుట్టుకు ఇన్ని ప్రయోజనాలా.. ఏయే సమస్యకు ఎలా వాడాలో తెలుసా?

కలబంద.దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

 Amazing Benefits Of Aloe Vera For Hair! Aloe Vera, Aloe Vera Benefits, Hair, Hai-TeluguStop.com

దాదాపు ప్రతి ఒక్కరి పెరట్లో కలబంద మొక్క కచ్చితంగా ఉంటుంది.కలబంద ఆరోగ్యపరంగా, సౌందర్య పరంగానే కాకుండా జుట్టు సంరక్షణకు సైతం ఉపయోగపడుతుంది.

అసలు కలబందతో జుట్టుకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.హెయిర్ ఫాల్ కంట్రోల్ నుంచి చుండ్రు నివార‌ణ వరకు ఎన్నో ప్రయోజనాలు కలబందతో పొందొచ్చు.

మరి ఇంతకీ ఏయే సమస్యకు కలబందను ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ఫాల్( Hair fall, ) సమస్యతో సతమతం అవుతున్నవారు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మందారం పువ్వుల పొడి, మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కలబంద జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంటన్నర తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో ఒక్కసారి ఇలా చేస్తే జుట్టు రాలడం క్రమంగా అదుపులోకి వస్తుంది.

Telugu Aloe Vera, Dandruff, Care, Care Tips, Fall, Masks, Latest-Telugu Health

అలాగే చాలా మంది హెయిర్ గ్రోత్ లేదని బాధపడుతుంటారు.అలాంటివారు ఆరు టేబుల్ స్పూన్ల రైస్ వాటర్ కు మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ మిక్స్ చేసి స్కాల్ప్ కు అప్లై చేసుకోవాలి.గంట తర్వాత తల స్నానం చేయాలి.వారానికి రెండుసార్లు ఇలా చేస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

Telugu Aloe Vera, Dandruff, Care, Care Tips, Fall, Masks, Latest-Telugu Health

పల్చటి జుట్టుతో బాధపడుతున్న వారు ఒక బౌల్‌లో నాలుగు టేబుల్ స్పూన్లు మెంతుల పొడి, ఐదారు స్పూన్లు కలబంద జెల్( Aloe vera ) వేసుకుని కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర తర్వాత తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ వేసుకుంటే జుట్టు కొద్దిరోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.డ్రై హెయిర్ తో బాధపడుతున్న వారు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌కు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె( coconut oil ) కలిపి జుట్టుకు పట్టించాలి.రెండు గంటల తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు సూపర్ సిల్కీగా మారుతుంది.

Telugu Aloe Vera, Dandruff, Care, Care Tips, Fall, Masks, Latest-Telugu Health

ఇక చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసి బాగా కలిపి స్కాల్ప్ కు ప‌ట్టించి గంటన్నర తర్వాత తల స్నానం చేయాలి.ఇలా చేస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube