అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald trump ) అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు భవిష్యత్తులోనూ వలసలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.ఆయన బాటలోనే పలు దేశాలు కూడా అడుగులు వేస్తున్నాయి.
ఇటీవల కెనడాలో జరిగిన ఇమ్మిగ్రేషన్ మార్పులు ఎవరికి శాశ్వత నివాసం కల్పించాలి? ఎవరిని మినహాయించాలి? అనే దానిపై దృష్టి పెట్టాయి.గత నెలలో ఫెడరల్ ప్రభుత్వం 6000 మంది వరకు స్టేటస్ లేని నిర్మాణ కార్మికులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించే జాతీయ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
డిసెంబర్ 2024లో ముగిసిన పైలట్ పథకం కింద గ్రేటర్ టొరంటో ఏరియాలో 1365 మందికి , వారి కుటుంబాలకు ఇది స్టేటస్‌ను అందించింది.
కెనడా వలస సంస్కరణలు .వ్యాపారం, పరిశ్రమ అవసరాలకు ప్రాధాన్యతను అందిస్తూనే ఉన్నాయని టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీలోని కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ ఇన్ మైగ్రేషన్ రీసెర్చ్ ఫెలో శివ ఎస్ మోహన్ అభిప్రాయపడ్డారు.ఇది శ్రమకు ఎక్కువ విలువను కేటాయించి, మరి కొన్నింటిని మాత్రం పక్కన పెడుతుందని మోహన్ అన్నారు.
కెనడా సమాఖ్య ఎన్నికల నేపథ్యంలో గృహ సంక్షోభం, నిర్మాణ రంగం స్పష్టమైన ప్రాధాన్యతగా మారింది .
కెనడియన్ హోమ్ బిల్డర్స్ అసోసియేషన్ ( Canadian Home Builders Association )వంటి గ్రూపులు మరింత నైపుణ్యం కలిగిన ట్రేడ్ వర్కర్ల కోసం, వేగవంతమైన గృహ నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.ఆ లాబీయింగ్ ప్రయత్నం ఫలించినట్లుగా కనిపిస్తోంది.రూఫర్లు, కాంక్రీట్ ఫినిషర్లు, హెవీ డ్యూటీ మెకానిక్‌లు, కుక్‌లు సహా 19 కొత్త వృత్తులను ట్రేడ్స్ విభాగంలో చేర్చాలనే డిమాండ్లు వినిపించాయి.
మాజీ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ 2024లో కెనడాలో 3,00,000 నుంచి 6,00,000 మంది విదేశీయులు నివసిస్తున్నట్లు తెలిపారు.కొత్త పథకం వీరిలో 1 లేదా 2 శాతం మందిని మాత్రమే కవర్ చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వలసలను కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం వచ్చే మూడేళ్లకు గాను వలస లక్ష్యాలను తగ్గించింది.హౌస్ కామన్స్ ఇమ్మిగ్రేషన్ కమిటీతో మిల్లర్ మాట్లాడుతూ.2025 చివరి నాటికి దాదాపు ఐదు మిలియన్ల తాత్కాలిక పర్మిట్లు ముగియనున్నాయి.వీరిలో చాలా మంది స్వచ్ఛందంగా దేశం విడిచిపెడతారని తాము అంచనా వేస్తున్నామని మిల్లర్ వెల్లడించారు.కెనడా కొత్త వలస లక్ష్యాల ప్రణాళిక ప్రకారం.2025 నాటికి శాశ్వత నివాస లక్ష్యం 5 లక్షల నుంచి 3.95 లక్షలకు తగ్గుతుంది.2026 నాటికి తాత్కాలిక విదేశీ కార్మికుల సంఖ్య 40 శాతం, అంతర్జాతీయ విద్యార్ధుల పరిమితి 10 శాతం తగ్గుతుందని అంచనా.జనాభా పెరుగుదల మందగించడం, గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలపై ఒత్తిడిని తగ్గించడం ఈ మార్పుల ఉద్దేశం.