జలుబు దగ్గు ఎంత తీవ్రంగా ఉన్నా సరే రెండు రోజుల్లో తరిమికొట్టండిలా!

జలుబు, దగ్గు.( Cold Cough ) అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇవి ముందు వరుసలో ఉంటాయి.

 This Is A Super Powerful Remedy For Get Rid Of Cold And Cough Details! Cold, Cou-TeluguStop.com

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా గత కొద్ది రోజుల నుంచి జలుబు, దగ్గు సమస్యలతో తీవ్రంగా మదన పడుతున్నారు.వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

కానీ సహజంగానే ఈ సమస్యలను తరిమికొట్టొచ్చు.అది కూడా కేవ‌లం రెండు రోజుల్లో.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అంగుళం ఎండిన అల్లం ముక్క, ( Ginger ) వన్ టేబుల్ స్పూన్ మిరియాలు,( Black Pepper ) వన్ టేబుల్ స్పూన్ పుప్పలి(లాంగ్ పెప్పర్) వేసుకుని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అయిన‌ తర్వాత ఐదు నుంచి ఆరు ఫ్రెష్ తులసి ఆకులు వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు తయారు చేసి పెట్టుకున్న పొడి పావు టేబుల్ స్పూన్ వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

ఈ వాటర్ ను రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే జ‌లుబు, ద‌గ్గు ఎంత తీవ్రంగా ఉన్నా సరే రెండు రోజుల్లోనే తగ్గుముఖం పడతాయి.పైగా ఈ వాటర్ ను తరచూ తీసుకుంటూ ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.లంగ్ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.వెయిట్ లాస్ అవుతారు.

బెల్లీ ఫ్యాట్ మాయం అవుతుంది.మ‌రియు క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చే రిస్క్ సైతం త‌గ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube