ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా సాగుతుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో రెండు చోట్ల టీడీపీ.ఒక చోట వైసీపీ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారని సమాచారం.
అటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యత కనబరుస్తున్నారు.దాదాపు టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు 20 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అదేవిధంగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యతలో ఉంది.







