అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దూకుడు నిర్ణయాలతో ప్రపంచానికి షాకులిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది.గత 80 ఏళ్లలో అత్యల్ప 100 రోజుల జాబ్ అప్రూవల్ రేటింగ్ పొందిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఆయన నిలిచారు.
ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం మొదలెట్టిన ట్రంప్‌పై అమెరికన్లు ప్రతికూలంగా ఉన్నారు.దేశంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించే విశ్వసనీయత విషయానికి వస్తే అతను ఇప్పటికీ కాంగ్రెస్ డెమొక్రాట్ల కంటే ముందున్నాడు.
ఏబీసీ న్యూస్/ వాషింగ్టన్ పోస్ట్ / ఇప్సోస్ పోల్‌లో పాల్గొన్న వారిలో 39 శాతం మంది అధ్యక్షుడిగా ట్రంప్ పనితనాన్ని సమర్ధిస్తున్నట్లు తెలిపారు.ఫిబ్రవరితో పోలిస్తే ఇది 6 శాతం పాయింట్లు తగ్గింది.దాదాపు 55 శాతం మంది అమెరికన్లు ట్రంప్ విధానాలపై విభేదిస్తున్నట్లు చెప్పారు.
2017లో తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 42 శాతం ఓట్లు పొందిన ఆయన.1945 తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక అమెరికా అధ్యక్షుడికి 100 రోజులు లేదా దానికి దగ్గరగా ఉన్న ఎన్నికల్లో లభించిన చివరి అత్యల్ప అప్రూవల్ రేటింగ్‌గా నిలిచింది.72 శాతం మంది ప్రతివాదుల ప్రకారం అతని ఆర్ధిక విధానాలు స్వల్పకాలిక మాంద్యానికి దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.73 శాతం మంది ప్రతివాదులు ఆర్ధిక వ్యవస్ధ పేలవమైన స్థితిలో ఉందని.53 శాతం మంది ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి మరింత దిగజారిందని పేర్కొన్నారు.41 శాతం మంది తమ వ్యక్తిగత ఆర్ధిక పరిస్ధితి మరింత దిగజారిందని తెలిపారు.

ఎన్‌బీసీ స్టే ట్యూన్డ్ పోల్( NBC Stay Tuned Poll ) ప్రకారం 45 శాతం అమెరికన్ పెద్దలు .ట్రంప్ అధ్యక్ష పదవి నిర్వహణను సమర్ధిస్తుండగా, 55 శాతం మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.మరోవైపు.
ట్రంప్ ఎంఏజీఏ (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) శిబిరం కూడా ఆయనకు బలమైన మద్ధతు ఇవ్వడం లేదు.అమెరికన్లలో నాలుగో వంతు మంది ట్రంప్ విధానాలను సమర్ధించారు.
ప్రతి 10 మందిలో నలుగురు తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ పోల్ ప్రకారం అమెరికన్లు ఆర్ధిక వ్యవస్ధకు అన్నింటి కంటే ప్రాధాన్యత ఇస్తారు.
ఎందుకంటే వారిలో 40 శాతం మంది మాత్రమే ట్రంప్ ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల నిర్వహణతో సంతృప్తి చెందారు.దాదాపు సమానంగా 39 శాతం మంది ప్రతివాదులు మాత్రం ట్రంప్ వాణిజ్య , సుంకాల విధానాలకు మద్ధతు ఇస్తున్నారు.
ఈ సుంకాలు ధరల పెరుగుదలకు దారి తీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.