Knee Pain: ఇది మీ డైట్ లో ఉంటే మోకాళ్ల నొప్పి అన్న మాటే అన‌రు!

మోకాళ్ల‌ నొప్పి.ఒకప్పుడు వయసు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించేది.

 If This Is In Your Diet Knee Pain Will Be Reduced Details! Knee Pain, Knee Pain-TeluguStop.com

కానీ ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది మోకాళ్ల‌ నొప్పితో తీవ్రంగా సతమతం అవుతున్నారు.ఈ క్రమంలోనే ఆ సమస్య నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో మందులు వాడుతున్నారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై అస్స‌లు చింతించకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెసిపీ మీ డైట్ లో కనుక ఉంటే మోకాళ్ల‌ నొప్పి అన్నమాటే అనరు.మరి మోకాళ్ల నొప్పిని తరిమికొట్టే ఆ రెసిపీ ఏంటి అన్నది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు గుమ్మడి గింజలు వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్‌లో అర కప్పు అవిసె గింజల‌ను కూడా వేసి మంచిగా వేయించుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న‌ గుమ్మడి గింజలు, అవిసె గింజలను వేసుకోవాలి.అలాగే అర కప్పు నల్ల ఎండు ద్రాక్షలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా క‌లుపుకోవాలి.

Telugu Black Raisins, Flax Seeds, Tips, Knee Pain, Latest, Pumpkin Seeds-Telugu

ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.దీనిని ఒక స్పూన్ చొప్పున ప్రతి రోజు తీసుకోవాలి.

ఇలా చేస్తే పుచ్చ గింజలు, అవిసె గింజలు మ‌రియు ఎండుద్రాక్షలలో ఉండే పలు పోషకాలు ఎముకలను దృఢంగా మారుస్తాయి.

మోకాళ్ల‌ నొప్పులను చాలా వేగంగా తగ్గిస్తాయి.అంతేకాదు ఈ రెసిపీ డైట్ లో ఉంటే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.

నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రావాలంటే భయపడతాయి.జుట్టు రాలే స‌మ‌స్య సైతం క్ర‌మంగా దూరం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube