ఏ పరిశ్రమలో అయినా మనకంటూ ఒక గుర్తింపు రావడం అన్నది నిజంగా ఎంతో గర్వకారణం.ఇక సినీ పరిశ్రమలో అయితే ప్రముఖ నటీనటులకు ఇలాంటి గుర్తింపు అన్నది గర్వ కారణంగా భావిస్తుంటారు.
డబ్బు కోసం మాత్రమే కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉండే చిత్రాలను ఎంచుకుని తమదైన శైలిలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందటానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు చాలా మంది నటీనటులు.కాగా ఇలాంటి అద్భుతమైన నటీనటులను గుర్తించి వారికి అవార్డులు, పురస్కారాలను అందిస్తుంటారు.
అదే విధంగా జాతీయ స్థాయిలోనూ పురస్కారాలను అందజేస్తుంటారు.అయితే నేషనల్ లెవల్ లో ఉత్తమ నటి పురస్కారం అందుకోవడం అంటే చాలా పెద్ద విషయం మరియు అరుదైన గౌరవం.కొందరికి మాత్రమే ఈ అరుదైన పురస్కారం వరిస్తుంది.ఈ గౌరవాన్ని అందుకోవాలని నటీనటులు ఎంతగానో ఆరాటపడుతుంటారు.ప్రతి సంవత్సరం కొన్ని వందలాది చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి.
అయితే అన్ని చిత్రాలలో నటించిన లక్షల మంది నటీనటుల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే దొరికే అరుదైన అవకాశం ఇది.కాగా ఈ జాతీయ స్థాయి అవార్డును అందించడానికి అర్హులను ఎంపిక చేసేందుకు వారికి కొన్ని గణాంకాలు ఉంటాయి.ఆ రకంగా ఆ క్యాలిక్యులేషన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆ సంవత్సరం ఏర్పాటైన జ్యూరీ తమ పరిశీలనకు వచ్చినటువంటి వందలాది సినిమాల నుండి ఒకరిని ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంటారు.
ఉత్తమ హీరో మరియు హీరోయిన్, ఉత్తమ పాత్ర, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు ఇలా ప్రతి కేటగిరీ నుండి ముగ్గురిని నామినేట్ చేయగా చివరికి ఒకరు లేదా ఇద్దరిని ఫైనల్ చేసి అవార్డులను ఇస్తుంటారు.ఆ విధంగా పలు నటనా కొలమానాలు ఆధారితంగా జాతీయ పురస్కాారానికి ఫైనల్ అవుతారు నటీనటులు.
అయితే ఈ అరుదైన పురస్కారానికి కొందరు నటీనటులకు దాదాపుగా ఫైనల్ అయి తృటిలో అన్నట్లు కొద్ది పాటిలో మిస్ అవుతుంటారు.
అయితే అలా మిస్స్ అయిన నటీనటుల్లో నటి సిమ్రాన్ మరియు జ్యోతికి కూడా ఉన్నారని అందుతున్న సమాచారం.అప్పట్లో తమిళ ఇండస్ట్రీ నుండి వీరికి జాతీయ స్థాయిలో అవార్డు దక్కాల్సి ఉండగా కొంతలో మిస్ అయ్యిందని తెలుస్తోంది.2002 లో తమిళ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో హీరోయిన్ సిమ్రాన్ “కన్నత్తిల్ ముత్త మిట్టల్” అనే చిత్రాన్ని చేశారు.ఇది తెలుగులో అమృతగా అనువాదం అయ్యింది.ఇందులో హీరోయిన్ సిమ్రాన్ ఏడేళ్ల పాపని పెంచిన తల్లిగా నటించారు.అయితే ఈ సినిమాలో సిమ్రాన్ నటనకు విమర్శకుల సైతం ఫిదా అయ్యారు.అంతేకాదు ఈ సినిమా ద్వారా జాతీయ అవార్డుకు సిమ్రాన్ దాదాపుగా ఫైనల్ అయ్యారట అయితే కొంచెంలో మిస్స్ అయ్యారని తెలుస్తోంది.
అయితే అందుకు కారణం ఈ పాత్రకి ఆమె సొంతగా డబ్బింగ్ చెప్పకపోవడమే అని తెలుస్తోంది.ఈమె ఒక పంజాబీ అందుకే ఆల్మోస్ట్ ఈమె చిత్రాలకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తుంటారు.
అలా ఈ సినిమాకి గాను అన్నిటిలోనూ బెస్ట్ గా అనిపించిన సిమ్రాన్ డబ్బింగ్ మాత్రం తనది కాకపోవడంతో ఈ అరుదైన పురస్కారానికి మిస్స్ అయ్యారని టాక్.
అలాగే 2005 లో చంద్రముఖి సినిమాకి గాను జ్యోతికకు జాతీయ స్థాయి అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు.
అయితే అది కొంచం లో మిస్స్ అయ్యిందని టాక్.ఇదే తరహాలో 2007 మొళి సినిమాలో జ్యోతిక నటనకు జాతీయ స్థాయి అవార్డు గ్యారెంటీ అని అంతా అనుకున్నారు.
కానీ ఏమయ్యింది ఏమో కానీ అపుడు కూడా పురస్కారం జ్యోతిని వరించలేదు.