ఇటీవల రోజుల్ల చిన్న వయసులోనే చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో తీవ్రంగా బాధ పడుతున్నారు.ఈ క్రమంలోనే తెల్ల జుట్టును దాచేందుకు కలర్స్‌పై ఆధారపడుతూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం నువ్వులు, ఉసిరి.ఈ రెండు పదార్థాలతో తెల్ల జుట్టు సమస్యను వదిలించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఉసిరి, నువ్వులను ఎలా వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుందో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో కప్పు ఎండిన ఉసిరి కాయ ముక్కలు వేసి పదిహేను నిమిషాల పాటు నీరు దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి.
ఉసిరి కాయ ముక్కలు మెత్తగా ఉడికిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికించిన ఉసిరి కాయ ముక్కలు, నానబెట్టుకున్న నువ్వులు పెరుగు మిశ్రమం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.ఆపై ఈ పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్ మిక్స్ చేసుకుంటే ప్యాక్ సిద్ధమైనట్టే.
ఈ ప్యాక్‌ను ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.మొదట జుట్టుకు ఎలాంటి నూనె లేకుండా చూసుకోవాలి.అనంతరం తయారు చేసుకున్న ప్యాక్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
కనీసం నాలుగు గంటల పాటు ప్యాక్‌ను ఉంచుకుని అప్పుడు మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒక్కసారి చేశారంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
మరియు జుట్టు మళ్లీ మళ్లీ తెల్లబడకుండా కూడా ఉంటుంది.