F-1 Student Visa : భారతీయ విద్యార్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా...!!!

ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్ళాలని, అక్కడ డిగ్రీ సంపాదించాలని ఎందరో కలలు కంటుంటారు.అక్కడ స్థిరపడానికి, విద్యను అభ్యసించటానికి ఎంతో మంది ఆశక్తి కనపరుస్తారు.

అలాగే భారతీయ విద్యార్ధులకు కూడా అమెరికా లో ఉన్నత విద్య వారి జీవిత లక్ష్యంగా చెప్పవచ్చు.ఇలా ఎదురు చూస్తున్న భారత విద్యార్ధులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

అదేంటంటే.వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి లో మొదలయ్యే విద్య సంవత్సరానికి గాను F1- స్టూడెంట్ వీసా జారీ చేయడానికి స్లాట్స్ విడుదల చేసింది.

దేశ రాజధాని ఢిల్లీ ఎంబసీతో పాటు, హైదరాబాద్, ముంబై, కోల్కత్తా , చెన్నై లలో కూడా ఒకేసారి కాన్సులేట్లు స్లాట్లను విడుదల చేశాయి.దీనితో , ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విద్యార్ధులంతా ఒక్కసారిగా తమ ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకోవాటానికి ప్రయత్నించగా ఆయా సర్వర్లు కూడా కాస్త నెమ్మదించాయి.

Advertisement

ఈక్రమంలోనే.

స్లాట్లు విడుదలైన కొద్ది సేపటికే నవంబర్ నెల కోట పూర్తయిపోయింది.అయితే నవంబర్ నెల మధ్యలో మరోసారి సాట్లను విడుదల చేస్తామని, ఇప్పుడు స్లాట్ దొరకని వాళ్ళకు ఇంకోసారి అవకాశం ఉంటుందని యూఎస్ అధికారులు ముందుగానే తెలియచేసారు.ఇదిలావుంటే, ఈ ఏడాది జూలై, ఆగస్ట్ లో పూర్తయిన విద్యా సంవత్సరం లో ఏకంగా ఎనబై వేల మంది భారతీయ విద్యార్ధులకు F1 స్టూడెంట్ వీసాలను జారి చేసారు, అదే విధంగా ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలోనే భారత విద్యార్ధులకు వీసాల ను జారి చేసే అవకాశం ఉండచ్చని ఆశాభావంం వ్యక్తం చేస్తున్నారు విద్యార్ధులు.

Advertisement

తాజా వార్తలు