టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
కాగా గత కొద్దిరోజులుగా సమంతకు సంబంధించి ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.మరి ముఖ్యంగా సమంత హెల్త్ విషయం గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
తాజాగా ఆ వార్తలకు పులి స్టాప్ పెడుతూ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది సమంత.
అదే సమంత మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ వార్త విన్న పలువురు సెలబ్రెటీలు ఆమెకు ధైర్యం చెబుతూ ఆమె తొందరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు చిరంజీవి, అక్కినేని అఖిల్ సమంత కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ట్వట్స్ చేసారు.
అయితే ఇప్పటివరకు సమంత హెల్త్ కండిషన్ పై అటు నాగార్జున నాగచైతన్య ఎవరు స్పందించలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరో నాగార్జున సమంతను పర్సనల్ గా కలవబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.సమంత మాజీ భర్త ఆయన అక్కినేని నాగచైతన్య ఇంతవరకు స్పందించలేదు.కానీ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే అక్కినేని నాగార్జున సమంతను పర్సనల్ గా వెళ్లి పలకరించాలి అనుకున్నట్లుగా తెలుస్తోంది.కుటుంబం పరంగా వారి విడిపోయినప్పటికీ వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది.
మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.







