ఇటీవల రోజుల్లో చాలా మందిలో సరిగ్గా హెయిర్ గ్రోత్ ఉండటం లేదు.ఆహారపు అలవాటు, పోషకాల కొరత, హార్మోన్ ఛేంజెస్, కాలుష్యం, హెయిర్ స్ట్రెయిట్నర్ను అధికంగా వినియోగించడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడటం ఇలా రకరకాల కారణాల వల్ల హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంటుంది.
దీంతో ఈ సమస్యను నివారించుకునేందుకు ఎన్నెన్నో ఆయిల్స్, సీరమ్స్ వాడతారు.తరచూ షాంపూలు మారుస్తుంటారు.
ఏవేవో హెయిర్ ప్యాకులు వేసుకుంటారు.అయినా ఫలితం లేకుంటే ఇంకేం చేయాలో తెలియక సతమతమైపోతుంటారు.
అయితే హెయిర్ గ్రోత్‌ను పెంచడంలో దాల్చిన చెక్క అద్భుతంగా సహాయపడుతుంది.దాల్చిన చెక్కలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు జుట్టు సంబంధిత సమస్యలను నివారించి హెయిర్ గ్రోత్‌ను పెంచుతాయి.మరి ఇంతకీ జుట్టుకు దాల్చిన చెక్కను ఎలా వాడాలి.? అన్న విషయం ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని దాల్చిన చెక్కలు తీసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల అవకాడో ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఒక వేళ మీ దగ్గర అవకాడో ఆయిల్ లేదు అంటే ఆలివ్ ఆయిల్‌ను కూడా యూజ్ చేయవచ్చు.
ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి.ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.అనంతరం కెమికల్స్ లేని షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
వారంలో ఒక్కటంటే ఒక్క సారి ఇలా చేశారంటే మీ హెయిర్ క్రమ క్రమంగా పెరగడాన్ని మీరే గమనిస్తారు.అదే సమయంలో జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.