క్రికెటర్లు సెలబ్రిటీలకు సంబంధించిన ప్రేమ వ్యవహారం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఎన్ని రోజులనుంచి క్రికెటర్లు సెలబ్రిటీల మధ్య ప్రేమ పుట్టడం జరుగుతుంది.
కొన్ని ప్రేమ జంటలు పెళ్లి వరకు వెళ్తే.కొన్ని మాత్రమే బ్రేకప్ అయ్యాయి.
ఇలా అటు క్రికెట్లో ఇటు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్గా మారిపోయిన లవ్ స్టోరీ అజయ్ జడేజా మాధురి దీక్షిత్ లవ్ స్టోరీ.ఈ లవ్ స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందాం.
1990లో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్నారు అజయ్ జడేజా.అప్పట్లో అజయ్ జడేజా బ్యాటింగ్ స్టైల్స్ లైక్ కి అమ్మాయిలు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది.అలాంటి అజయ్ జడేజా అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ తో ప్రేమలో పడ్డాడు.చట్టపట్టాలెసుకుని తిరిగాడు.వీరి ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది అని అందరూ అనుకున్నారు.కానీ బ్రేక్ అయ్యింది.
ఒక మ్యాగ జైన్ ఫోటోషూట్ కోసం వెళ్తే అక్కడే మాధురి దీక్షిత్ కలిసింది.వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
మాధురి దీక్షిత్ ప్రేమను ఉపయోగించుకుని వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నాడు అజయ్.మాధురి దీక్షిత్ కూడా అజయ్ జడేజా కు అండగా నిలవాలని అనుకుంది.కొంతమంది నిర్మాతలకు అజయ్ పేరును రికమండ్ చేసింది.అంతలో భారత్ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ ముసలం మొదలైంది.ఇందులో అజయ్ జడేజా పేరు కూడా ఉంది.దీంతో మాధురి దీక్షిత్ ప్రమేయం లేకుండానే మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అజయ్ జడేజా వాళ్లది రాజకుటుంబం.దీంతో సినిమా యాక్టర్ కోడలిగా రావడానికి అసలు అంగీకరించలేదు.
అంతలో ఫిక్సింగ్ లో దోషిగా తేలడంతో మాధురి రిలేషన్ షిప్ లో ఉండాలని అనుకోలేదు ఇక అజయ్ కుటుంబం ఏమనుకుంటుందో తెలిసిన మాధురి దీక్షిత్ బ్రేకప్ కు సిద్దమైంది.అజయ్ జయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
ఇక ఇప్పుడు మాధురి దీక్షిత్ శ్రీరామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.