రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పండ్లలో దానిమ్మ( Pomegranate ) ఒకటి.పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ దానిమ్మను ఇష్టంగా తింటుంటారు.
అయితే దానిమ్మ గింజలే కాదు దానిమ్మ తొక్కలు( Pomegranate Peel ) కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి.దానిమ్మ తొక్కలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు బయోయాక్టివ్ సమ్మేళనాలు నిండి ఉంటాయి.
అందువల్ల అవి మనకు హెల్త్ పరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా దగ్గుకు( Cough ) చెక్ పెట్టడానికి దానిమ్మ తొక్కలు చాలా అద్భుతంగా తోడ్పడతాయి.
ఎండబెట్టిన లేదా తాజా దానిమ్మ తొక్కలతో తయారు చేయబడిన టీ దగ్గుకు ఎఫెక్టివ్ హోం రెమెడీ.దానిమ్మ తొక్క టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.దగ్గుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.గొంతులో రద్దీని క్లియర్ చేస్తాయి.వేగంగా దగ్గు సమస్యను దూరం చేస్తాయి.
కాబట్టి దగ్గు సమస్యతో సతమతం అవుతున్నవారు దానిమ్మ తొక్క టీను( Pomegranate Peel Tea ) ట్రై చేయవచ్చు.పైగా ఈ టీ తయారు చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదు.మీరు తాజా దానిమ్మ తొక్కలను ఉపయోగిస్తుంటే, వాటిని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.ఆపై స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాయిల్ అయ్యాక అందులో దానిమ్మ తొక్కలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని తేనె కలుపుకుంటే టీ రెడీ అయినట్లే.
దానిమ్మ తొక్క టీను రెగ్యులర్ డైట్ లో కూడా చేర్చుకోవచ్చు.ఈ టీ జీర్ణక్రియ పని తీరును పెంచుతుంది.
విరేచనాలు మరియు జీర్ణవ్యవస్థలో అసౌకర్యానికి ఈ టీని ఇంటి నివారణగా చేస్తుంది.అలాగే దానిమ్మ తొక్క టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
రక్తపోటును అదుపులో ఉంచుతాయి.హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.