ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి( Venu Swamy ) భార్య వీణవాణి( Veena Vani ) కూడా అందరికీ ఎంతో సుపరిచితమే.ఈమె వీణ వాయిద్యరాలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ఇటీవల కాలంలో వేణు స్వామితో పాటు ఆయన భార్య వీణవాణి సైతం పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్టు( Allu Arjun Arrest ) గురించి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే వీణా వాణి సైతం అల్లు అర్జున్ అరెస్టు గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా అల్లు అర్జున్( Allu Arjun ) జైలు నుంచి ఇంటికి రాగానే తన కుటుంబ సభ్యులు ఆయనకు దిష్టి తీస్తున్నటువంటి వీడియో పట్ల ఈమె స్పందిస్తూ.నేను మొన్నే చెప్పాను కదా బాగా దిష్టి తగిలిందని ఒక 100 గుమ్మడికాయలతో దిష్టి తీయించుకోమని చెప్పాను కానీ అప్పుడు తీయించుకోలేదు ఇప్పుడు తీయించుకుంటున్నారు అంటూ ఈమె ఈ వీడియోలో తెలియజేశారు.
పోనీలే నా మాట మీద ఆమాత్రమైన గౌరవం ఉండి ఇప్పుడు దిష్టి తీయించుకున్నారు.
ఇక ఇప్పటితో దిష్టి మొత్తం పోయింది లేండి ఇక నెక్స్ట్ చేయాల్సిన పనుల గురించి ఆలోచించండి అంటూ షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈమె పుష్ప 2( Pushpa 2 ) సినిమాని చూసిన తర్వాత ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ నటన చాలా అద్భుతంగా ఉందని తెలిపారు.అయితే ఈ సినిమా ద్వారా ఆయనకు చాలా దిష్టి తగిలి ఉంటుందని వంద గుమ్మడికాయలతో దిష్టి తీయించుకోండి అంటూ తెలిపారు.
అయితే ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఆయనకు నిజంగానే దిష్టి తగిలిందనీ అభిమానులకు కూడా కామెంట్లు చేస్తున్నారు.