తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బిగ్ బాస్ 8( Bigg Boss 8 ) కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సీరియల్ నటుడు నిఖిల్( Nikhil ) విజేతగా నిలిచారు.
ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే లో భాగంగా పలువురు సెలబ్రిటీలు వారి సినిమా ప్రమోషన్లలో భాగంగా హాజరై సందడి చేశారు.అదేవిధంగా ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో విజేతకు ట్రోఫీ అందించడం కోసం పాన్ ఇండియా స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ పాల్గొని సందడి చేయడమే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో మాట్లాడి సందడి చేశారు.అనంతరం ఈయన శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా గురించి కూడా పలు విషయాలు మాట్లాడటమే కాకుండా టీజర్ వీడియోని కూడా ప్లే చేశారు.అనంతరం రామ్ చరణ్ చేతుల మీదుగా విజేత నిఖిల్ కి ట్రోఫీ అందజేశారు.ఇలా ఇప్పటివరకు ప్రసారమైన అన్ని సీజన్లో కూడా పలువురు సెలబ్రిటీలు వేదిక పైకి వచ్చి విజేతలకు ట్రోఫీలు అందజేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే సీజన్ 8 కార్యక్రమంలో కూడా రామ్ చరణ్ రావడంతో ఈ కార్యక్రమంలో ఈయన పాల్గొనడం కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకున్నారనే విషయంపై ప్రస్తుత చర్చలు జరుగుతున్నాయి.సాధారణంగా సెలబ్రిటీలు ఏ ఈవెంట్ కి రావాలన్నా కూడా తప్పనిసరిగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు అయితే రామ్ చరణ్ మాత్రం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్నందుకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది.గతంలో కూడా చిరంజీవి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో సందడి చేశారు అయితే చిరంజీవి కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు అందుకే చరణ్ కూడా తన తండ్రి బాటలోనే ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నాగార్జున( Nagarjuna ) పిలుపు మేరకే ఈ కార్యక్రమంలో సందడి చేశారని తెలుస్తుంది.