బంగారు పళ్లు పెట్టించుకున్న వ్యక్తి వాటిపై ఏం రాయించుకున్నాడో తెలిస్తే..

కొంతమంది చేసే పనులు మనకి షాక్ కలిగిస్తాయి.వాళ్లు చేసే వింత పనులు బహుశా మనం కలలో కూడా ఊహించలేం.

 Man Gets His Natural Teeth Removed For Gold Teeth With His Name Inscribed Video-TeluguStop.com

తాజాగా అలాంటి ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా నవ్వుకుంటున్నారు.

చాలామంది రంధ్రాలు పడ్డ పళ్ళను బాగు చేయించుకోవడానికో లేదా పళ్ళకు క్యాప్ పెట్టించుకోవడానికో డెంటిస్ట్ దగ్గరకు వెళ్తారు.కానీ ఈ వ్యక్తి మాత్రం పూర్తిగా భిన్నమైన కారణంతో డెంటిస్ట్( Dentist ) దగ్గరకు వెళ్ళాడు.

తన సహజసిద్ధమైన టీత్ తీసేసి, వాటి స్థానంలో కొత్త దంతాలను పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు.

రాజన్ చౌదరిగా( Rajan Chaudhary ) గుర్తించబడిన ఆ వ్యక్తి, తన ముందు దంతాలను తొలగించి, ప్రత్యేకంగా తయారు చేయబడిన బంగారు పళ్లను( Golden Teeth ) పెట్టుకోవడానికి ఒక డెంటిస్ట్‌ను సంప్రదించాడు.

కానీ అసలు ఆశ్చర్యం ఏమిటంటే, ఒక్కో బంగారు పన్ను మీద ఒక్కో అక్షరం చొప్పున తన పేరు “రాజన్” అని వచ్చేలా రాసుకున్నాడు.ఇలా బంగారు పళ్లపై తన పేరును రాయించుకున్న మొదటి వ్యక్తిగా రాజన్ నిలిచాడు.

రాజన్ ఒక టాటూ ఆర్టిస్ట్. అతను చాలా ప్రత్యేకమైన, అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండాలని కోరుకున్నట్లు ఉన్నాడు.వీడియోలో, అతని నేచురల్ టీత్ ను( Natural Teeth ) తీసేసి, వాటి స్థానంలో తన పేరు కలిగిన మెరిసే బంగారు దంతాలను డెంటిస్ట్ చేత పెట్టించుకున్నాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన కొంత సమయానికే ఈ వీడియో వైరల్ అయింది.

ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.దీనికి 12 మిలియన్లకు పైగా వ్యూస్‌, 65,700 లైక్స్‌ వచ్చాయి.

సోషల్ మీడియా యూజర్లు భిన్నమైన స్పందనలు వ్యక్తం చేశారు.కొందరు దీన్ని చూసి నవ్వుకున్నారు, అతని నిర్ణయాన్ని వింతగా అభివర్ణించారు.మరికొందరు ఇలాంటి దంత చికిత్స ఎక్కడ చేయించుకోవచ్చో తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు.ఒక యూజర్ అతన్ని “చాప్రి అల్ట్రా ప్రో మాక్స్” అని సరదాగా కామెంట్ చేశాడు.

సాధారణంగా పిచ్చి చేష్టలు చేసే, వింతగా ఉండే వాళ్లను వెక్కిరించడానికి ఈ పదం ఉపయోగిస్తారు.రాజన్ చేసిన ఈ సాహసోపేతమైన దంత మార్పు ఆన్‌లైన్‌లో నవ్వులను, ఆసక్తిని రేకెత్తించింది.

దాంతో అతను సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశంగా మారాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube