ఒక చిన్నారి బాలిక( Little Girl ) తన స్కూల్ క్రిస్మస్ వేడుకలో( School Christmas Event ) చేసిన ప్రసంగం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.ఆ వీడియో ఎందుకు అంతలా ఆకట్టుకుంటుందంటే ఆ చిన్నారి చాలా కాన్ఫిడెంట్‌గా, ఫన్నీ స్పీచ్ డెలివరీ చేసింది.ఈ చిన్న వీడియోలో, ఆ అమ్మాయి తన గురించి, తన క్లాస్‌మేట్స్ గురించి ఎంత గర్వపడుతోందో చాలా క్యూట్‌గా చెప్పింది.“నేను నా గురించి, నా క్లాస్‌లో ఉన్న నా స్నేహితులందరి గురించి చాలా గర్వపడుతున్నాను,” అని తన గర్వంగా మొదలుపెట్టింది.ఆ తర్వాత, సరదాగా ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చింది, “ఒక చిన్న అబ్బాయి తప్ప, మా క్లాస్ నిజంగా చాలా మంచిది” అని అనడంతో ఆడియన్స్ ఒక్కసారిగా నవ్వేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వేడుక చూడముచ్చటైన స్కూల్ క్రిస్మస్ ఫంక్షన్ లా ఉంది.వెనకవైపు పండుగ వాతావరణాన్ని పెంచేలా “మెర్రీ క్రిస్మస్”( Merry Christmas ) బ్యానర్ కూడా కనిపిస్తోంది.ఆ అమ్మాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో,( Self-Confidence ) అందంగా మాట్లాడడం ఆ క్షణాన్ని మరింత ఆనందంగా మార్చింది.ఒక అబ్బాయి తప్ప క్లాస్ మేట్స్ అందరూ మంచి వాళ్లే అని చెప్పిన తర్వాత స్పీచ్ చివర్లో, “నేను మీకు ఇంకో విషయం చెప్పాలి…” అని అనబోతుండగా, టీచర్( Teacher ) మెల్లగా మైక్ తీసుకున్నారు.
కానీ, ఆ చిన్నారి ఏమాత్రం బాధపడలేదు.అందరూ నవ్వుతూ ఉండగా, చాలా కాన్ఫిడెంట్‌గా వేదిక దిగి వెళ్ళిపోయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.అమ్మాయి ధైర్యాన్ని, క్యూట్‌నెస్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు.చాలామంది నెటిజన్లు ఆమె ఎంత ముద్దుగా, కాన్ఫిడెంట్ గా ఉందో కామెంట్లు చేస్తున్నారు.“ఆమెని స్పీచ్ పూర్తి చేయనివ్వండి! ఆమెకి ఏదో చెప్పాలని ఉంది,” అని ఒకరు సరదాగా రాశారు.“ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కు అంబాసిడర్‌గా ఉండాలి!” అని మరొకరు అన్నారు.ఈ వేడుక ఎక్కడ జరిగిందో తెలియకపోయినా, ఈ చిన్నారి ప్రసంగం సోషల్ మీడియాలో నవ్వులు, సంతోషాన్ని పంచుతూ అందరి హృదయాలను హత్తుకుంది.