మన భారతదేశంలో ఈ తాటికల్లు చాలామంది రుచి చూసి ఉంటారు.కల్లు లో చాలా రకాలు ఉంటాయి.
తాటికల్లు ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ తాటికల్లు తాటి చెట్టు నుంచి తీస్తారు.
ఇవే కాకుండా తాటి చెట్టు నుండి తాటికాయల కూడా తీస్తారు.తాటికల్లు ఆల్కహాల్ తో సమానమైన కిక్ ను ఇస్తాయి.
కానీ తాటికల్లు త్రాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.ఆరోగ్యానికి మంచిదని తాటికల్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.
ఆల్కహాల్ కూడా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం పై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది.ఈ తాటికల్లు మన ఆరోగ్యానికి దివ్య ఔషధంలా పనిచేస్తాయని కొంతమంది ఆయుర్వేద నిపుణుల సలహా.
అప్పుడే తాటి చెట్టు నుంచి తీసిన తాటికల్లు లో మానవ శరీరానికి అవసరమైన 18 రకాల సూక్ష్మజీవులు ఉంటాయని ఈ తాటికల్లు గురించి తెలిసిన వారు చెబుతారు.దాదాపు తాజా తాటి కల్లులో 53 రకాల సూక్ష్మ జీవులు ఉంటాయని కొన్ని పరిశోధనలలో తెలిసింది.
తాజా తాటికల్లు త్రాగడం వలన మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఎండాకాలంలో తాటి కల్లు తాగడం వల్ల మన శరీరానికి చలువ చేస్తుంది.ఉదయం పరిగడుపున తాజా తాటి కల్లు తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని మన పూర్వీకుల నమ్మకం.ఈ దివ్య ఔషధానికి క్యాన్సర్ కారక కణాలను నశింపజేసే శక్తి కూడా ఉంది.
ఇంకా టైఫాయిడ్, డయోరియా లాంటి విషపూరితమైన జ్వరాలు వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న ఈ తాటికల్లు యాంటీ బయాటిక్ గా కూడా పని చేస్తుంది.అలాగే పులిసిపోయిన పుల్లని తాటికల్లు తాగకూడదు.
వీటిని తాగడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.