సినిమాఅనే రంగుల ప్రపంచంలో హీరోల భవిష్యత్తును నిర్ణయించేది ప్రేక్షకులే అని చెప్పాలి.ఎందుకంటే ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఎంత స్టార్ హీరో అయినా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా అయినా అది ప్రేక్షకులకు నచ్చకపోతే అట్టర్ ఫ్లాప్ అవ్వాల్సిందే.
ఇక నిర్మాతలకు భారీ నష్టాలు రావాల్సిందే.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల విషయంలో ఇది నిజం అయింది.
భారీ అంచనాల మధ్య విడుదలై చివరికి డిజాస్టర్ గా మిగిలి నిర్మాతలకు నష్టాలను మిగిల్చిన సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలయ్య హీరోగా 1993లో వచ్చిన నిప్పురవ్వ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి చివరికి అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది.
ఇక ఈ సినిమా ఫ్లాప్ కారణంగా నిర్మాతలకు రెండు కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.ఇక అంతకు ముందు అంతం, ఆపద్బాంధవుడు సినిమాలు ఫ్లాప్ అవడంతో నిర్మాతలకు ఒక్క కోటి నష్టాలు రావడం గమనార్హం.
ఇక చిరంజీవి నటించిన బిగ్ బాస్ మూవీ దారుణంగా ఫ్లాప్ కావడంతో నిర్మాతలకు నాలుగు కోట్ల నష్టాలు వచ్చాయట.నాగార్జున హీరోగా వచ్చిన రక్షకుడు మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
దీంతో నిర్మాతలకు 7కోట్ల నష్టాలు మిగిలాయి.
చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి చివరికి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.దీంతో ఇక నిర్మాతలకు పది కోట్ల వరకు నష్టాలు వచ్చాయట.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ మూవీ నిర్మాతలకు 13 కోట్ల నష్టాలను మిగిల్చింది.
బాలకృష్ణ హీరోగా భారీ అంచనాల మధ్య వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు అంచనాలను అందుకోలేకపోయింది.దీంతో నిర్మాతలకు 15 కోట్లు నష్టాలు మిగిలాయి.ఎన్టీఆర్ ఆంధ్రావాలా, సైనికులు లాంటి సినిమాలు కూడా 15 కోట్ల నష్టాలు మిగిల్చటం గమనార్హం.
ఇక బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్కమగాడు సినిమా నిర్మాతలకు 17 కోట్ల నష్టాలను మిగిల్చింది.పవన్ కళ్యాణ్ పులి, మహేష్ బాబు ఖలేజా మూవీలు 22 కోట్ల నష్టాలను చవిచూశాయి.మహేష్ బాబు వన్ నేనొక్కడినే 40 కోట్ల వరకు నష్టాలను తెచ్చిపెట్టింది.
పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ 45 కోట్ల నష్టాలే మిగిల్చింది.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం 54 కోట్ల భారీ నష్టాలలో నిర్మాతలను ముంచేసింది.
మహేష్ బాబు స్పైడర్ మూవీ 60 కోట్ల దాకా నష్టాలు తీసుకువచ్చింది.ఇక అజ్ఞాతవాసి 67 కోట్ల నష్టాలు తెచ్చిపెట్టింది.
ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమా ప్రపంచవ్యాప్తంగా 71 కోట్ల నష్టాన్ని తీసుకు రావడం గమనార్హం.