పాలు ఏ స‌మ‌యంలో తాగ‌కూడ‌దు.. ఎవ‌రెవ‌రు తాగ‌కూడదు?

పోషకాలను అందించే సంపూర్ణ ఆహారం పాలు.( Milk ) నిత్యం ఒక గ్లాస్ పాలు తాగితే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.

 At What Time Should Not Drink Milk Details, Milk, Milk Health Benefits, Latest N-TeluguStop.com

విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్ల‌తో నిండి ఉండే పాలు ఎముకలు, దంతాల‌ను బ‌లోపేతం చేస్తాయి.పాలలో హై-క్వాలిటీ ప్రోటీన్ కండరాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

నిద్ర సమస్యలకు పాలు చ‌క్క‌న ప‌రిష్కారం అవుతాయి.పాలలోని ట్రిప్టోఫాన్ మ‌రియు మెలటోనిన్ నిద్ర‌లేమికి( Insomnia ) చెక్ పెడ‌తాయి.

నిద్ర నాణ్య‌త‌ను పెంచుతాయి.పాలలో ఉండే పొటాషియం ర‌క్తపోటు నియంత్రణలో ఉంచుతుంది.పాలలో ఉండే విటమిన్ ఎ, బి12, బయోటిన్ చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.ఒమేగా-3 మ‌రియు ప్రోటీన్ కేశ సంర‌క్ష‌ణ‌కు మ‌ద్ద‌తు ఇస్తాయి.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం పాలు తాగ‌కూడ‌దు.అలాగే కొన్ని స‌మ‌యాల్లో పాలు తాగ‌డం మంచి కాదు.అస‌లు పాలు ఏ స‌మ‌యంలో తాగ‌కూడ‌దు.? ఎవ‌రెవ‌రు తాగ‌కూడ‌దు.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.కొంతమందికి పాలలోని లాక్టోస్( Lactose ) అనే ఎంజైమ్ సరిపడదు.

అలాంటివారు పాలు తాగితే డయేరియా, కడుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌ను అనుభ‌వించ‌వ‌చ్చు.

Telugu Dont Milk, Gas Acidity, Tips, Healthy, Kidney Problems, Latest, Milk, Mil

కిడ్నీ సమస్యలు( Kidney Problems ) ఉన్నవారు పాలు తాగ‌డానికి వైద్య‌లు స‌ల‌హా తీసుకోవాలి.ఎందుకంటే, పాలలో కాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.కిడ్నీ ఫంక్షన్ బాగా లేకపోతే వాటిని జీర్ణించలేరు.

పాల తీసుకోవడం కిడ్నీ రాళ్లు ముదిరే అవకాశం కూడా ఉంటుంది.కొంద‌మంతికి మిల్క్ అల‌ర్జీ ఉంటుంది.

వీరు పాలు తాగారంటే వెంటనే చర్మ అలర్జీ, వాపు, ఛాతి బిగుతుగా అనిపించడం వంటి సమస్యలు త‌లెత్తుతాయి.అందువ‌ల్ల మిల్క్ అల‌ర్జీ ఉన్న‌వారు కూడా పాలును ఎవైడ్ చేయాలి.

Telugu Dont Milk, Gas Acidity, Tips, Healthy, Kidney Problems, Latest, Milk, Mil

ఇక‌పోతే పాలు కొన్ని సమయాల్లో తాగకూడదు.ముఖ్యంగా భోజ‌నం చేసిన‌ వెంటనే పాలు తాగ‌కూడ‌దు.అలా తాగితే జీర్ణక్రియ ప్రభావితమవుతుంది, అసిడిటి, గ్యాస్ సమస్యలు రావచ్చు.మసాలా లేదా ఉప్పు కలిపిన ఆహారం తిన్న వెంటనే పాలు తాగ‌కూడ‌దు.ఎందుకంటే, పాలలోని ప్రొటీన్ ఉప్పు లేదా మసాలాలతో ప్రతికూలంగా స్పందించి జీర్ణ సమస్యలు కలిగించవచ్చు.ఖాళీ కడుపుతో పాలు తాగ‌డం మంచిది కాదు.

కొంత‌మంతికి ఖాళీ క‌డుపుతో పాలు తాగితే అసిడిటి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.అందుకే ఖాళీ క‌డుపుతో కాకుండా ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసిన కొంత‌స‌మ‌యానికి పాలు తాగాలి.

రాత్రి పడుకోవ‌డాన‌కి అర‌గంట‌ ముందు పాలు తాగడం వ‌ల్ల మంచిగా నిద్ర ప‌డుతుంది.వర్కౌట్ తర్వాత కూడా పాలు తీసుకోవ‌చ్చు.

త‌ద్వారా శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube