బీహార్ రాష్ట్రం,( Bihar ) కతిహార్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.అవనీష్ కుమార్( Avneesh Kumar ) అనే 30 ఏళ్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని ఆయన ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు అపహరించారు.
అంతేకాదు “పకడ్వా వివాహ్”( Pakadua Vivah ) అనే ఒక బలవంతపు పెళ్లి ఆచారం ప్రకారం అతడికి లవర్‌ను ఇచ్చి పెళ్లి చేశారు.డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం అవనీష్ పాఠశాలకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
మీడియా సమాచారం ప్రకారం, అవనీష్ ముందు ఒక SUV ఆగింది.సాయుధ వ్యక్తులు బయటికి వచ్చి అతన్ని కిడ్నాప్( Kidnap ) చేశారు.తుపాకీ గురి పెట్టి దగ్గరలోని ఒక దేవాలయానికి తీసుకెళ్లి లఖిసరై జిల్లాకు చెందిన 25 ఏళ్ల గుంజన్( Gunjan ) అనే మహిళతో బలవంతంగా పెళ్లి జరిపించారు.తాను, అవనీష్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని గుంజన్ తర్వాత చెప్పింది.
పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక మాట తప్పాడని అవనీష్‌పై ఆమె ఆరోపణలు చేసింది.దీనితో తన కుటుంబం ఇలాంటి తీవ్ర చర్యకు పాల్పడాల్సి వచ్చిందని ఆమె తెలిపింది.
బలవంతపు పెళ్ళి( Forced Wedding ) తర్వాత గుంజన్‌ను బేగుసరాయ్ జిల్లాలోని అవనీష్ ఇంటికి తీసుకెళ్లారు.అయితే, అతని కుటుంబ సభ్యులు ఆమెను తమ కోడలిగా అంగీకరించడానికి నిరాకరించారు.దీంతో అవనీష్ తన కిడ్నాప్, బలవంతపు పెళ్లి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గుంజన్ కూడా అవనీష్ తనను పెళ్లి చేసుకుంటానని చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది.తమ మధ్య నిజమైన సంబంధం ఉందని, తనకు న్యాయం కావాలని ఆమె కోరింది.అవనీష్ మాత్రం ఆమెతో తనకు ఎప్పుడూ సంబంధం లేదని ఖండించాడు.
ఆమె, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని, వెంబడిస్తున్నారని ఆరోపించాడు.తనను కొట్టి, తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి తంతులో పాల్గొనేలా బలవంతం చేశారని కూడా అతను ఆరోపించాడు.
ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ బలవంతపు పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.పకడ్వా వివాహ్ అంటే మగవారిని కిడ్నాప్ చేసి గంట పాయింట్ వద్ద వారికి పెళ్లి జరిపించే ఒక విచిత్రమైన ఆచారం.2024 సంవత్సరంలోనే ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువగా నమోదయ్యాయి.