ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా ఉండాలని లైఫ్ లో ఎలాంటి కష్టాలు ఎదురుకాకూడదని భావిస్తారు.జీవితంలో కొన్ని సందర్భాల్లో చిన్నచిన్న కష్టాలు సైతం తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.
అయితే ఒక్కరోజు జైలు జీవితం బన్నీని భయపెట్టిందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్( Allu Arjun ) ఇకపై తన సినిమాలను థియేటర్లలో అభిమానులతో కలిసి చూడకపోవచ్చని తెలుస్తోంది.
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి( Revathi ) అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది.బన్నీ లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసినా ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.
బన్నీ ఈ వివాదం వల్ల తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.అందువల్ల భవిష్యత్తులో బన్నీ మరింత జాగ్రత్త పడే ఛాన్స్ అయితే ఉంది.

ఈ తరహా ఘటనలు జరగకుండా బన్నీ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో తెరకెక్కనుంది.ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారికంగా అప్ డేట్స్ రానున్నాయి.హారిక హాసిని బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

అటు బన్నీకి ఇటు త్రివిక్రమ్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది.పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాతో బన్నీకి బాధ్యత పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.బన్నీ భారీ ప్రాజెక్ట్ లతో తన సినీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.