దేవుడా.. న్యూడిల్స్ తిన్నట్లు బతికున్న పాములను అలా తినేస్తుందేంట్రా బాబు (వీడియో)

ప్రతి దేశ ప్రజలు ప్రత్యేకమైన ఆహార అలవాట్లను కలిగి ఉంటారు.కొన్ని దేశాల్లో పచ్చి ఆకుకూరలను తింటారు.

 Woman Eating Live Snakes Video Viral On Social Media Details, Social Media, Vira-TeluguStop.com

మరికొన్ని దేశాల్లో పచ్చి జంతువులను తినడం ఆనవాయితీగా ఉంటుంది.ఇవి వారికి పూర్వికుల నుండి వచ్చిన ఆహార అలవాట్ల ప్రభావం వాళ్ళ ఉంటుంది.

అందుకే ప్రపంచం విభిన్న రుచుల సమ్మేళనంగా నిలుస్తోంది.చాలామంది బ్రతకడం కోసం ఆహారాన్ని తీసుకుంటే, కొంతమంది తినడమే జీవన ప్రయోజనంగా భావిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఆహార ప్రియులు( Food Lovers ) అనేక మంది ఉన్నారు.కొందరు జీవితాన్నే ఒక రుచిగా భావిస్తూ, ఎప్పుడూ కొత్త వంటకాలను అన్వేషిస్తూ ఉంటారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా విపరీతంగా పెరగడంతో, ఫుడ్ బ్లాగర్లు( Food Bloggers ) కూడా పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నారు.వీరు వివిధ రకాల ఆహారాలను ఆస్వాదిస్తూ, వాటి గురించి వీడియోలు, ఫోటోలు పంచుకుంటూ ఉంటారు.తాజాగా, ఓ ఫుడ్ బ్లాగర్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఆ వీడియో ఏంటో, అందులో ఏమున్నదో ఇప్పుడు తెలుసుకుందాం.ఇటీవల ఓ యువతి తిన్న ఆహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆమె తిన్నది ఏమిటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.వీడియో వివరాల్లోకి వెళ్తే, ఆ యువతి ఏకంగా బ్రతికే పాములను( Live Snakes ) తినడం కనపడుతుంది.ఒక బౌల్‌లో ఉన్న చిన్న చిన్న పాము పిల్లలను ఆమె ఎలాంటి భయం లేకుండా చేతిలో తీసుకుని, నోట్లో పెట్టి నమిలి మింగడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

మనలో చాలామంది పొడవైన నూడిల్స్( Noodles ) తింటూ ఉండడం చూసి ఉంటాం.కానీ, ఈ యువతి బ్రతికే పాము పిల్లలను తినడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

ఆమె ఆ పాములను పట్టుకోవడంలోనూ, తినడంలోనూ ఏమాత్రం భయపడడం లేదు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube