నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయం అయిన హీరో.
కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం ఆయన సినిమా కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగడం లేదు.అప్పుడోసారి, ఇప్పుడోసారి హిట్ సినిమాలు పడుతున్నాయి.
అలా బండి లాక్కొస్తున్నాడు.స్టేబుల్ విజయాలు సాధించడంలో మాత్రం ఆయన ఇప్పటివరకు సక్సెస్ కాలేదు.
తొలిసారి తన కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ సినిమా చేస్తున్నాడు.నూతన దర్శకుడు మల్లాది వేణుతో కలిసి బింబిసార అన భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.
తాజాగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.
బింబిసార సినిమా 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మాణం అవుతుంది.ఈ సినిమా తెరమీదకు తెచ్చేందుకు గడిచిన 5 సంవత్సరాలుగా ప్లాన్ జరుగుతుందట.డైరెక్టర్ వేణు ఈ సినిమా కథని 5 ఏళ్ల క్రితమే రెడీ చేశాడట.అంతేకాదు.
ముగ్గురు టాప్ హీరోలకు ఈ సినిమా కథని వినిపించాడట.
కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు చివరగా కళ్యాణ్ రామ్ దగ్గరకు చేరింది.
తొలుత ఈ సినిమా కథను మెగా ఫ్యామిలీ హీరోగా అల్లు శిరీష్ దగ్గరకు 5 ఏండ్ల కిందటే తీసుకెళ్లాడట వేణు.అంతేకాదు.
గీతా ఆర్ట్స్ లో భారీ మైతలాజికల్ మూవీ చేస్తున్నట్లు శిరీష్ కూడా వెల్లడించాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లింది.
ఇదే కథను నితిన్ తో పాటు రామ్ కూడా చెప్పాడట దర్శకుడు.కానీ ఈ తమకి సెట్ కాదని ఇద్దరూ నో చెప్పారట.ముగ్గురు హీరోలు కాదని చెప్పిన ఈ సినిమా చివరకు కల్యాణ్ రామ్ దగ్గరకు చేరరింది.కొన్ని మార్పుల తర్వాత ఆయన ఓకే చెప్పాడట.ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.ఈ సినిమా అయినా కల్యాణ్ రామ్ రేంజ్ పెంచుతుందో లేదో చూడాలి.