ప్రపంచవ్యాప్తంగా మరో రెండు రోజుల్లో 12 వేల థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న పుష్ప 2 (puspa 2)సినిమాపై సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు.పుష్ప మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పాన్ ఇండియా లెవెల్లో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో భారతదేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలలో సినిమాకు సంబంధించిన ఈవెంట్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా బీహార్ లోని పాట్నా నగరంలో(Patna city, Bihar) నిర్వహించిన కార్యక్రమానికి ఏకంగా మూడు లక్షల మందికి పైగా సినీ ప్రేక్షకులు హాజరయ్యారంటే సినిమా కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్(Allu Arjun) సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తుండగా, డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 సంబంధించిన వీడియోకు స్కూప్ గా చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
పుష్ప 2 టీజర్ (Pushpa 2 Teaser)అచ్చం అలానే ఉండే విధంగా షూట్ చేసి ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.సినిమా రిలీజ్ కాబోయే ముందు పుష్ప టీంకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.చతుర్ అనే పిల్లాడు హీరో అల్లు అర్జున్ లాగా ఆడ వేషంలో తయారయ్యి అచ్చం సినిమా టీజర్ లో కనిపించే విధంగా ఇందులో కనిపించాడు.
సినిమాలో అల్లు అర్జున్ జాతర ఎపిసోడ్ లో ఉన్న అదే యాటిట్యూడ్ తో నటించి మెప్పించాడు.ఇక ఈ వీడియో చివర్లో టీజర్ సంతోష్ ముత్యాలయ దర్శకత్వంలో వచ్చినట్లుగా పేర్కొన్నాడు.
ఈ వీడియో అచ్చం చూడడానికి పుష్ప సినిమా వలె ఉండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేసేస్తున్నారు.దింతో అల్లు అభిమానులు అదిరిపోయిందంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.
ఎలాగైనా ఈ వీడియో హీరో అల్లు అర్జున్ వరకు చేరాలంటూ కామెంట్ చేస్తున్నారు.