ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక విషయం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం సహజమే.ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్( Viral Video ) అవుతున్నాయి.
ఇందులో భాగంగా అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు కూడా ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఒక కోతి( Monkey ) నాగుపాము( King Cobra ) సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వైరల్ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
వైరల్ వీడియోని గమనించినట్లయితే.ఓ ఊరి బయట పంట పొలాల నడుమ కోతి నాగుపాము కనబడడం జరుగుతుంది.నాగుపాము ప్రపంచంలోనే అత్యధిక విషపూరిత పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ఇక ఈ వీడియోలో మొదట నాగుపాము కోతిని కాటు వేయడానికి మూడు నాలుగు సార్లు తన పడగతో ప్రయత్నం చేస్తుంది.ఆయన కానీ.కోతి ఆ పాము చుట్టూనే అటు ఇటు తిరుగుతూ దానితో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.ఇందులో భాగంగానే కోతి ఏకంగా నాగుపాముని శివుడిలా మెడకు వేసుకొని అటు ఇటు తిప్పడం గమనించవచ్చు.
దాంతో పాము కూడా ఏమి చేయలేక అలా చూస్తు ఉండిపోయింది అంతే.
కోతి నాగుపాముని ఒక ఆట వస్తువుగా భావించిందో ఏమో తెలియదు కానీ.బుసలు కొడుతున్న పామును మెడలో వేసుకొని చేయడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.అయితే, ఈ ఘటన తర్వాత కోతికి ఏమైందో అన్న విషయం మాత్రం తెలియ రాలేదు.
ఈ వైరల్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరేమో అయ్యో కోతి డేంజర్ లో పడిందంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో వీడియో తీసే వ్యక్తికైనా తెలివి లేదా అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.