డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో విడుదలవుతున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమాపై సినీ అభిమానులు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు.ఇక సినిమా విడుదల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాకు సంబంధించిన టికెట్ల ధరలను అమాంతం పెంచేశారు.
ఇక హైదరాబాద్ మహానగరాలలో అయితే ఒక్కొక్క టికెట్ దాదాపు 2000 వరకు అమ్ముతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇకపోతే సినిమా విడుదల సందర్భంగా అనేక చోట్ల పుష్ప కటౌట్ లకు( Pushpa Cutouts ) సంబంధించిన అనేక ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగానే ఓ కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
డిసెంబర్ 5న తెల్లవారుజామున నుండే పుష్ప జాతర ప్రపంచవ్యాప్తంగా మొదలు కాబోతోంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసేసారు.అయితే ఓ సినిమా థియేటర్ వద్ద భారీగా ఏర్పాటు చేసిన కటౌట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.ఈ కటౌట్ లో అల్లు కుటుంబం( Allu Family ) సంబంధించిన అందరూ ఉండడం ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది.
ఇక ఈ కటౌట్లో.మొదటి జనరేషన్ అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) నుంచి రాబోయే జనరేషన్ అల్లు అయాన్( Allu Ayaan ) వరకు అందరి ఫోటోలు ఉండడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ కటౌట్ లో అల్లు రామలింగయ్య ఫోటోతో మొదలై ఆ తర్వాత అల్లు అర్జున్,( Allu Arjun ) అల్లు బాబి, అల్లు అరవింద్ , అల్లు శిరీష్, అల్లు అయాన్ ల ఫోటోలు ఉండడం సెన్సేషనల్ గా మారింది.ఇది చూసిన అల్లు అర్జున్ అభిమానులు మాకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ నగరంలో సోమవారం నాడు ఈ చిత్ర రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నగరాలలో మాత్రమే డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల నుండి ప్రీమియర్ షోలు ఆడబోతున్నాయి.ఇక అర్ధరాత్రి ఒకటి నుంచి ఉదయం 4 గంటల వరకు బెనిఫిట్ షోలో రాష్ట్రవ్యాప్తంగా పడబోతున్నాయి.ఈ సినిమా మొత్తానికి ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12వేల థియేటర్లలో భారీగా రిలీజ్ అవుతుంది.