రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి దుర్మరణం.. ఏడాది తర్వాత నిందితురాలి అరెస్ట్

గతేడాది అమెరికాలోని కనెక్టికట్‌లో( Connecticut ) జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో ఓ భారతీయ విద్యార్ధి( Indian Student ) మరణించిన కేసులో 41 ఏళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.న్యూ హెవెన్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్ధి అయిన ప్రియాంషు అగ్వాల్‌ (23)( Priyanshu Agwal ) గతేడాది అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

 41 Year Old Woman Arrested In Hit-and-run Death Of Indian Student In Us Details,-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించిన నవంబర్ 18న జిల్ ఔగెల్లి( Jill Augelli ) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

హార్ట్‌ఫోర్డ్ కొరెంట్‌లోని నివేదిక ప్రకారం.

మరణానికి కారణమైన ఘటనలో ఆమె తప్పించుకోవాలని చూసినట్లు ఒక కౌంట్ అభియోగాన్ని నమోదు చేశారు.అగ్వాల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.

న్యూ హెవెన్ పోలీస్ డిపార్ట్‌మెంట్( New Haven Police Department ) సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ ఘటనలో ప్రమేయం ఉన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించింది.

Telugu America, Run, Indian, Jill Augelli, Haven, Priyanshu Agwal, Priyanshuagwa

ఈ మీడియాలో సమావేశంలో ప్రియాంషు సోదరుడు అమన్ ఎమోషనల్ అయ్యాడు.తన సోదరుడిని ప్రతిరోజూ మిస్ అవుతున్నానని చెప్పాడు.రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగిన తర్వాత కనీసం డ్రైవర్ కారు దిగి చూడలేదని ఆరోపించారు.

న్యూ హెవెన్ మేయర్ జస్టిన్ ఎలికర్ సైతం ప్రియాంషు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అమెరికాలో గొప్ప జీవితంపై కలలు కన్న ప్రియాంషు చనిపోయే సమయంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నాడని తెలిపారు.

మరణించిన సమయంలోనూ అతను తన పెద్ద మనసు చాటుకున్నాడని , ప్రియాంషు గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చిన అతని కుటుంబ సభ్యులకు మేయర్ ధన్యవాదాలు తెలిపారు.

Telugu America, Run, Indian, Jill Augelli, Haven, Priyanshu Agwal, Priyanshuagwa

న్యూ హెవెన్ పోలీస్ చీఫ్ కార్ల్ జాకబ్సన్ మాట్లాడుతూ.ఘటన సమయంలో నిందితురాలిపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు లేవని తెలిపారు.ఈ క్రమంలో ఆమె సెల్‌ఫోన్ క్యారియర్ నుంచి జీపీఎస్ డేటాను పొందామని చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ప్రియాంషు అక్టోబర్ 18, 2023న రాత్రి 11 గంటల సమయంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వస్తుండగా కారు ఢీకొట్టింది.

దీంతో అగ్వాల్‌ను హుటాహుటిన న్యూహెవెన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ వారం తర్వాత కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube