102 ఏళ్లలో ఆస్ట్రేలియా విజిట్ చేసిన అవ్వ.. దాంతో ఏడు ఖండాలు చుట్టేసిందిగా..

మన కలలను సాకారం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించవచ్చని చాలామంది వృద్ధులు చెబుతుంటారు.కొందరు తమ చిన్ననాటి కలను వృద్ధాప్యంలో సహకారం చేసుకుని అందరికీ పూర్తిగా నిలుస్తుంటారు.

 102-year-old Woman Visits Australia Fulfils Her Dream Of Touring All Seven Conti-TeluguStop.com

తాజాగా 102 ఏళ్ల వయసులో డోరతీ స్మిత్( Dorothy Smith ) అనే అవ్వ తన లైఫ్ లాంగ్ డ్రీమ్ నెరవేర్చుకున్నారు.తాను జీవితంలో ఒక్కసారి అయినా అన్ని ఖండాలను తిరగాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఆమె ఇటీవల ఆస్ట్రేలియాను( Australia ) సందర్శించారు.

ఆస్ట్రేలియాకు విజయవంతంగా రావడంతో ఆమె “అన్ని ఖండాలను సందర్శించిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి”గా రికార్డు సృష్టించారు.

ఆమెను అమ్మర్ కందిల్, స్టాఫన్ టేలర్ అనే యూట్యూబర్లు ఆస్ట్రేలియాకి తీసుకువెళ్లారు.93 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానెల్ “యెస్ థియరీ”ని( Yes Theory ) వారు రన్ చేస్తున్నారు.వీళ్లు అక్టోబర్‌లో కాలిఫోర్నియాలోని మిల్ వాలీలోని రెడ్‌వుడ్స్ రిటైర్‌మెంట్ విలేజ్‌లో ఒక కథను చిత్రీకరించడానికి వెళ్లారు.

ఆ సమయంలో డోరతీ వారికి పరిచయమయ్యారు.తనకు ప్రయాణం ఎంతో ఇష్టమని, తాను చూడని ఏకైక ఖండమైన ఆస్ట్రేలియాను సందర్శించాలనే తన కోరికను వ్యక్తం చేశారు.

Telugu Traveler, Australia, Bucket List, Dorothy Smith, Dorothysmith, Journey, S

ప్రయాణం తనకు ఎందుకు ముఖ్యమో డోరతీ వివరించారు.“ఈ ప్రపంచం చాలా పెద్దది, ప్రతి దేశానికి ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి.నేను ఏదీ మిస్ చేసుకోకూడదు” అని ఆమె పేర్కొన్నారట.అమ్మర్, టేలర్ ఆమె కలను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు.డెస్టినేషన్ NSW, క్వయాంటాస్ సంస్థల మద్దతుతో, వారు డోరతీ, ఆమె కూతురు అడ్రియన్‌ల కోసం ప్రత్యేక ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు.గత వారం, డోరతీని సిడ్నీకి( Sydney ) బిజినెస్ క్లాస్‌లో తీసుకొచ్చారు.

Telugu Traveler, Australia, Bucket List, Dorothy Smith, Dorothysmith, Journey, S

సిడ్నీలో, డోరతీ ప్రసిద్ధ హార్బర్‌లో క్రూయిజ్ చేశారు.కంగారులు, కోలాలు చూడడానికి వైల్డ్ లైఫ్ సిడ్నీ జూను సందర్శించారు.సిడ్నీ ఆపెరా హౌస్, బోండీ బీచ్ వంటి ప్రత్యేక స్థలాలను అన్వేషించారు.ఆమె బొటానికల్ గార్డెన్స్, మ్యూజియం ఆఫ్ కంటెంపరరీ ఆర్ట్‌ను కూడా సందర్శించారు.డోరతీ ప్రయాణాన్ని యెస్ థియరీ యూట్యూబ్ వీడియోలో చూపించారు, ఇది ఇప్పటికే 400,000 కంటే ఎక్కువ వ్యూస్, 28,000 లైక్‌లను పొందింది.https://youtu.be/38PwG3zGDDI?si=NOxnytaUryMe8qOe ఈ లింకు పై క్లిక్ చేసి ఆమె ప్రయాణాన్ని చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube