మెంతులు.( Fenugreek Seeds ) రుచికి చేదుగా ఉన్న ఎన్నో విలువైన పోషకాలను కలిగి ఉంటాయి.ఆరోగ్యపరంగా మెంతులు అపారమైన ప్రయోజనాలను అందిస్తాయి.బరువు నిర్వాహణలో, మధుమేహం క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంలో తోడ్పడతాయి.అలాగే చర్మ సౌందర్యాన్ని( Skin Care ) మెరుగుపరిచే సత్తా కూడా మెంతులకు ఉంది.ముఖ్యంగా ముఖ చర్మం పై మొండి మచ్చలను వదిలించడానికి మెంతులు ఉపయోగపడతాయి.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు పెసలు( Greengram ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ను వేసుకోవాలి.అలాగే చిటికెడు ఆర్గానిక్ పసుపు మరియు సరిపడా పచ్చి పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా మెంతుల్లో ఉండే పలు పోషకాలు మొండి మచ్చలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
మచ్చలను క్రమంగా మాయం చేస్తాయి.స్పాట్ లెస్ స్కిన్ ను( Spotless Skin ) మీ సొంతం చేస్తాయి.
అలాగే ఈ రెమెడీని తరచూ పాటించడం వల్ల స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది.డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.స్కిన్ స్మూత్ గా మారుతుంది.అంతేకాకుండా ఈ రెమెడీ మొటిమలకు అడ్డుకట్ట వేస్తుంది.చర్మాన్ని సూపర్ వైట్ అండ్ బ్రైట్ గా మెరిపిస్తుంది.కాబట్టి మచ్చలేని మెరిసే అందమైన చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.