టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Srinivas ) ఒకరు కాగా ఈ హీరోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.అల్లుడు శీను, రాక్షసుడు, మరికొన్ని సినిమాలతో ఈ హీరో విజయాలను అందుకున్నారు.
అయితే త్వరలోనే ఈ హీరో పెళ్లి( Marriage ) పీటలెక్కనున్నారని సమాచారం అందుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ నెలలో నాగచైతన్య శోభితల పెళ్లితో పాటు కీర్తి సురేష్ పెళ్లి కూడా జరగనున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం సినిమాతో( Bhairavam Movie ) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రముఖ నిర్మాత, శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్( Bellamkonda Suresh ) తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మా పెద్దబ్బాయి లైఫ్ సెట్ అయిపోయిందని ఆయన కామెంట్లు చేశారు.శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ లో నేను ఇంకో సినిమాను స్టార్ట్ చేస్తానని ఆయన వెల్లడించారు.2025 సంవత్సరంలోనే శ్రీనివాస్ పెళ్లి జరగొచ్చని ఆయన కామెంట్లు చేశారు.ఆల్మోస్ట్ పెళ్లి ఫిక్స్ అయినట్టేనని చెప్పుకొచ్చారు.త్వరలోనే పెళ్లికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని బెల్లంకొండ సురేష్ తెలిపారు.చిన్నబ్బాయి కెరీర్ సెట్ కావాలని ఆ తర్వాతే పెళ్లి అని ఆయన చెప్పుకొచ్చారు.
భైరవం మూవీ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ నెల 20వ తేదీన భైరవం మూవీ థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బెల్లంకొండ శ్రీనివాస్ పారితోషికం ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతుండటం గమనార్హం.బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.