పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.పుష్ప ది రూల్ సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రెడ్డిదే( Sukumar Reddy ) అని బన్నీ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
థాంక్స్ మీట్ లో భాగంగా బన్నీ మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.థాంక్యూ ఇండియా ఈ సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని బన్నీ అన్నారు.
ఇది లవ్ కాదని వైల్డ్ లవ్ అని ఆయన కామెంట్లు చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, సినీ ప్రియులతో పాటు ఎగ్జిబిటర్లు, చిత్ర బృందానికి ధన్యవాదాలు అని బన్నీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఒక వ్యక్తికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నానని ఆ వ్యక్తి బండి సుకుమార్ రెడ్డి( Bandi Sukumar Reddy ) అని బన్నీ తెలిపారు.సుకుమార్ పూర్తి పేరు అభిమానులలో చాలామందికి తెలియదు.

అయితే బన్నీ( Bunny ) తన కామెంట్ల ద్వారా సుకుమార్ పూర్తి పేరు గురించి చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.సుకుమార్ విజన్ నుంచే ఈ సినిమా పుట్టిందని సుకుమార్ హార్డ్ వర్క్ వల్లే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు.హిందీ ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే పుష్ప ఈ స్థాయికి వచ్చేది కాదని బన్నీ పేర్కొన్నారు.సినిమా కలెక్షన్లు తాత్కాలికమని ప్రేక్షకుల ప్రేమ శాశ్వతమని బన్నీ అన్నారు.